Varun Gandhi : ప్లీజ్ సంయ‌నం పాటించండి – వ‌రుణ్ గాంధీ

జ‌వాన్ల‌కు దేశం ముఖ్యమ‌ని గ్ర‌హించండి

Varun Gandhi : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ వ‌రుణ్ గాంధీ సీరియ‌స్ గా స్పందించారు అగ్నిప‌థ్ స్కీం విధ్వంసంపై. ద‌య‌చేసి ఓ అన్న‌య్య‌గా వేడుకుంటున్నా. హింస‌కు పాల్ప‌డ‌కండి.

ఈ దేశం మీ కోసం చూస్తోంది. పాల‌కులు ఇవాళ ఉంటారు రేపు ఉండ‌క పోవ‌చ్చు. కానీ మీరు శాశ్వతం. నిర‌స‌న‌, ఆందోళ‌న జ‌రిపే ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంది. దానిని కాద‌న‌లేం.

కానీ శాంతియుతంగా నిర్వ‌హించాల‌ని సూచించారు వ‌రుణ్ గాంధీ(Varun Gandhi). ఆయ‌న గ‌త కొంత కాలంగా మోదీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇటీవ‌లే దేశంలో నిరుద్యోగం ఎలా పెరిగిందో పేర్కొన్నారు.

రైతుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ఐదేళ్ల‌కు ఎన్నుకోబ‌డే ప్ర‌జా ప్రతినిధులు నాలుగేళ్ల‌కే ఎలా రిక్రూట్ మెంట్ చేస్తారంటూ ప్ర‌శ్నించారు. నిప్పులు చెరిగారు.

ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని కూడా పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో శాఖ‌ల వారీగా ప్ర‌క‌టించారు. వ‌రుణ్ గాంధీ(Varun Gandhi) ఇచ్చిన డేటాను ఐఎంఎం ఎంపీ ఓవైసీ ప్ర‌స్తావించారు.

దేశ వ్యాప్తంగా ఇది క‌ల‌క‌లం రేగింది. ఈ త‌రుణంలో దేశ‌వ్యాప్తంగా కేంద్రం తీసుకు వ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీంపై నిర‌స‌న‌లు మిన్నంటాయి. ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా మారాయి.

రైళ్ల‌ను టార్గెట్ చేశారు. బ‌స్సుల‌ను త‌గుల బెట్టారు. దీంతో యువ‌త ప్ర‌స్తుతానికి సంయ‌మ‌నం పాటించాల‌ని కోరారు. శుక్ర‌వారం వ‌రుణ్ గాంధీ త‌న ట్విట్ట‌ర్ ఖాతా వేదిక‌గా వీడియో సందేశాన్ని ఇచ్చారు.

ప్ర‌జాస్వామ్య మ‌ర్యాద‌ను కాపాడాల‌ని సూచించారు. ఒక జ‌వాను ఎల్ల‌ప్పుడూ మొద‌ట త‌న దేశానికి ప్ర‌యారిటీ ఇస్తాడ‌ని తెలిపాడు. అహింసా ప‌ద్ద‌త‌లును అవ‌లంభించాల‌ని కోరారు.

Also Read : రైల్వే ఆస్తుల‌ను ధ్వంసం చేయొద్దు – వైష్ణ‌వ్

Leave A Reply

Your Email Id will not be published!