Varun Gandhi : అంతా అయి పోయాక ఆలోచిస్తే ఎలా
అగ్నిపథ్ స్కీంపై వరుణ్ గాంధీ ఫైర్
Varun Gandhi : భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన ముందు నుంచీ తప్పు పడుతూ వస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షం. మోదీ నాయకత్వాన్ని అందరూ ప్రశంసిస్తుంటే వరుణ్ గాంధీ మాత్రం వేలెత్తి చూపుతున్నారు.
ఆయన రూరల్ ఎకానమీ (గ్రామీణ ఆర్థికం)పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అంతే కాదు ఎంపీ వరుణ్ గాంధీ తో పాటు మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సైతం కేంద్రంపై మండిపడుతున్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోవడం వల్ల పార్టీకి పెద్ద నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగిన రైతుల ఉద్యమానికి వీరిద్దరూ బేషరతుగా మద్దతు ప్రకటించారు.
ఈ తరుణంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్ని పథ్ స్కీంను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. భారత దేశ సాయుధ దళాలలో షార్ట్ టర్మ్ స్కీంను తీసుకు రావడం మంచి పద్దతి కాదని సూచించారు వరుణ్ గాంధీ(Varun Gandhi).
ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇదే సమయంలో ముందస్తుగా రక్షణ రంగ నిపుణులతో , ప్రతిపక్షాలతో, మేధావులతో సంప్రదింపులు జరపకుండానే ఎలా పథకాన్ని తయారు చేస్తారని ప్రశ్నించారు.
ఇది పూర్తిగా పక్కదారి పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో ప్రధానమైన కీలకమైన రంగం రక్షణ రంగం. అంతా అయి పోయాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని ప్రశ్నించారు వరుణ్ గాంధీ(Varun Gandhi).
అగ్నిపథ్ స్కీం ను రూపొందించే సమయంలో వివిధ కోణాలను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. అందువల్లనే దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Also Read : అగ్నిపథ్ స్కీం ఆర్మీకి తీవ్ర నష్టం