Vasireddy Padma : స‌మ‌న్లు ఈజీగా తీసుకుంటే కుద‌ర‌దు

స్ప‌ష్టం చేసిన చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ

Vasireddy Padma : బాధితురాలిని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన త‌న‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించిన టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడుతో పాటు టీడీపీ నేత బొండా ఉమ‌కు ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ(Vasireddy Padma) స‌మ‌న్లు జారీ చేశారు.

ఈనెల 27న ఉద‌యం 11 గంట‌ల‌కు మంగ‌ళ‌గిరిలోని క‌మిష‌న్ కార్యాల‌యంలో వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల్సిందేన‌ని స‌మ‌న్లలో పేర్కొన్నారు. చైర్ ప‌ర్స‌న్ పై దాడి చేసేందుకు య‌త్నించ‌డాన్ని క‌మిష‌న్ సీరియ‌స్ గా తీసుకుంది.

స‌మ‌న్లు జారీ చేయ‌డాన్ని తేలిగ్గా కొట్టి పారేశారు బొండ ఉమ‌. ఈ సంద‌ర్బంగా ఆరోప‌ణ‌లు కూడా చేశారు. దీనిపై ఏపీ ఉమెన్ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ (Vasireddy Padma)స్పందించారు. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

మ‌హిళా క‌మిష‌న్ సుప్రీమా అని ప్ర‌శ్నిస్తున్నారు. నీలాంటి వారికి అది సుప్రీమేనంటూ స్ప‌ష్టం చేశారు. ఇలాంటి ప‌ద్ద‌తిని ఎవ‌రూ హ‌ర్షించ‌ర‌ని, మ‌హిళ‌ల‌ను వేధింపుల‌కు గురి చేసే వారికి క‌మిష‌న్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో తెలుసుకుని మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు.

బాధితురాలి ప‌ట్ల ఎలా వ్య‌వ‌హ‌రించాలో కూడా చంద్ర‌బాబు నాయుడికి తెలియ‌ద‌ని అర్థ‌మైంద‌న్నారు ఆమె. ఏదో యుద్దానికి వెళుతున్న‌ట్లు, కావాల‌ని రాజ‌కీయం చేయాల‌ని ఇలా వ్య‌వ‌హ‌రించారే త‌ప్పా అస‌లైన బాధితురాలిని ఓదార్చేందుకు మాత్రం కాద‌న్నారు వాసిరెడ్డి ప‌ద్మ‌.

ఎవ‌రైనా, ఎంత‌టి స్థాయిలో ఉన్నా మ‌హిళ‌ల ప‌ట్ల ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తే స‌మ‌న్లు ఇచ్చే అధికారం త‌మ‌కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. క‌మిష‌న్ స‌మ‌న్లు ఇచ్చిందంటే క‌చ్చితంగా హాజ‌రు కావాల్సిందే. లేదంటే కోర్టు ధిక్క‌ర‌ణ కింద‌కు వ‌స్తుంద‌ని చెప్పారు.

Also Read : మ‌హిళా సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

Leave A Reply

Your Email Id will not be published!