Sandhya Devanathan : అపార అనుభవం అరుదైన గౌరవం
ఎవరీ సంధ్యా దేవనాథన్
Sandhya Devanathan : రాబోయే భవిష్యత్తులో టెక్నాలజీ పరంగా యావత్ ప్రపంచంలో భారతీయులదే కొనసాగుతుందని యూఏఈ ఐటీ శాఖ మంత్రి చెప్పిన మాట వాస్తవం. ఇవాళ టాప్ కంపెనీలలో ప్రవాస భారతీయులే కీలక పదవులను నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా మరో కీలక పదవిని వరించింది తమిళనాడుకు చెందిన సంధ్యా దేవనాథన్(Sandhya Devanathan).
గూగుల్ లో ఎవరీ సంధ్యా దేవనాథన్ అంటూ వెదకడం ప్రారంభమైంది. మెటా – ఫేస్ బుక్ ఇండియా హెడ్ గా నియమించింది దిగ్గజ సంస్థ. సంధ్యా దేవనాథన్ అంతకు ముందు ఆసియా ఫసిపిక్ కు వైస్ ప్రెసిడెంట్ గా పని చేశారు. ఏప్రిల్ 2020 నుండి 2 ఏళ్లకు పైగా ఎపాక్ కోసం గేమింగ్ వ్యాపారపు బాధ్యతలను నిర్వహించారు.
బిలియన్ డాలర్ల వ్యాపారం దీని ద్వారా నడుస్తోంది. దీనిని చేపట్టింది సంధ్యా దేవనాథన్ కావడం విశేషం. మెటా కంపెనీలో ఐదు టాప్ విభాగాలలో గేమింగ్ కూడా ఒకటి. అంతకు ముందు పెప్పర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ లో బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. నేషనల్ లైబ్రరీ బోర్డులో సభ్యురాలిగా పని చేశారు.
సింగపూర్ మేనేజ్ మెంట్ యూనివర్శిటీ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ లో సభ్యురాలిగా ఉన్నారు సంధ్యా దేవనాథన్. కాలేజ్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ స్టడీస్ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ సభ్యురాలిగా పని చేశారు. సింగపూర్ కమ్యూనికేషన్స్ , సమాచార మంత్రిత్వ శాఖలో ఉన్నారు. డిజిటల్ రెడీనెస్ కౌన్సిల్ సింగపూర్ స్టీరింగ్ కమిటీలో భాగంగా ఉన్నారు సంధ్యా దేవనాథన్(Sandhya Devanathan).
మహిళల ఫోరమ్ ఫర్ ది ఎకానమీ సలహా మండలిలో ఆసియా అడ్వైజరీ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. అంతకు ముందు సింగపూర్ కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ గా , వియత్నాంకు కూడా కంట్రీ ఎండీగా పని చేశారు. 2016 ఆగస్టు 1న సంధ్యా దేవనాథన్ సౌత్ ఈస్ట్ ఆసియా కోసం ఫేస్ బుక్ లో లీడ్ పోస్ట్ లో చేరారు.
సింగపూర్ కు మొట్టమొదటి కంట్రీ డైరెక్టర్ గా మారారు. పలు కంపెనీలలో వివిధ విభాగాలలో ఉన్నత పదవులను నిర్వహించారు. ఆ అనుభవమే ఇపుడు ఇండియా హెడ్ గా బాధ్యతలు స్వీకరించేలా చేసింది సంధ్యా దేవనాథన్ ను.
Also Read : మెటా ఇండియా హెడ్ గా ‘దేవనాథన్’