Venkaiah Naidu : ఉచిత హామీలకు నేను వ్యతిరేకం
ముప్పవరపు వెంకయ్య నాయుడు
Venkaiah Naidu : న్యూఢిల్లీ : ఎన్నికల హామీల్లో ఉచితాలకు తాను పూర్తి వ్యతిరేకమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆర్ధిక పరిస్థితులు, భవిష్యత్‌లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆర్ధిక వనరులు ఉంటాయా అని అంచనా వేయకుండా హామీలు ఇస్తుంటారని విమర్శించారు.
Venkaiah Naidu Comments Viral
ఇలాంటి ఆచరణకు నోచుకోని హామీల వల్ల ప్రజల ఖజానాపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి పార్టీలు దూరంగా ఉండాలని సూచించారు. లేక పోతే దేశానికి తీరని ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. ఎక్కడి నుంచి వీటిని తీసుకు వస్తారంటూ ప్రశ్నించారు. ప్రజలకు జవాబుదారీతనం లేకుండా పోతుందని ఆవేదన చెందారు మాజీ ఉప రాష్ట్రపతి.
పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను పొడిగిస్తూ మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే దేశంలో పేద, మధ్యతరగతి, మధ్య తరగతికి దిగువన అనేక మంది ప్రజలు ఉన్నారని మాజీ ఉప రాష్ట్రపతి అన్నారు.
ఢిల్లీ కాలుష్యం జాతీయ సమస్య అని అన్నారు.. కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతోందన్నారు. కాలుష్య నియంత్రణ ఢిల్లీ సర్కార్ చేతిలో ఉందన్నారు వెంకయ్య నాయుడు. ప్రతి ఒక్కరు పరిశుభ్రత, పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
Also Read : TS High Court Notice : అక్రమాస్తుల కేసులో జగన్ కు నోటీస్