TS High Court Notice : అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్ కు నోటీస్

జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

TS High Court Notice : తెలంగాణ – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కోలుకోలేని షాక్ త‌గిలింది. అక్ర‌మ ఆస్తుల కేసులో జ‌గ‌న్ కు నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు(TS High Court). మాజీ ఎంపీ హ‌రి రామ జోగ‌య్య పిల్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టింది కోర్టు.

TS High Court Notice Viral

చీఫ్ జ‌స్టిస్ జ‌స్టిస్ అలోక్ అరాధే, జిస్టిస్ ఎన్ వి శ్రావ‌ణ్ కుమార్ తో కూడిన ధ‌ర్మాస‌నం సుదీర్ఘ విచార‌ణ చేప‌ట్టింది. పిల్ గా ప‌రిగ‌ణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంత‌రాల‌పై విచార‌ణ‌. అంతేకాకుండా పిల్ లో స‌వ‌ర‌ణ‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్లు కోర్టు పేర్కొంది.

హ‌రి రామ జోగ‌య్య త‌రపు న్యాయ‌వాది పోలిశెట్టి రాధాకృష్ణ వాద‌న‌ల‌తో హైకోర్టు ఏకీభ‌వించింది. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యం కింద ప‌రిగ‌ణించేందుకు ధ‌ర్మాస‌నం అంగీకారం తెలిపింది. అంతే కాకుండా హ‌రి రామ జోగ‌య్య పిల్ కు నెంబ‌ర్ కేటాయించాల‌ని రిజిస్ట్రీని ఆదేశించింది హైకోర్టు .

ప్ర‌తివాదులుగా ఉన్న ఏపీ సీఎంతో పాటు సీబీఐకి కూడా నోటీసులు పంపించింది. ఇదిలా ఉండ‌గా సీబీఐ కోర్టులో జ‌గ‌న్ కేసుల విచార‌ణ వేగంగా పూర్తి చేసేలా ఆదేశించాల‌ని హ‌రి రామ జోగ‌య్య త‌న పిల్ లో పేర్కొన్నారు.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

Leave A Reply

Your Email Id will not be published!