Vennamaneni Srinivasa Rao : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజుకో ట్విస్ట్
ఎవరీ శ్రీనివాస్ రావు ఏమిటా కథ
Vennamaneni Srinivasa Rao : ఢిల్లీ లో మద్యం స్కామ్ జరిగితే దేశ వ్యాప్తంగా కలకలం రేగుతోంది. అంతా బడా బాబులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఒకరి వెంట మరొకరు బయట పడుతున్నారు.
తాజాగా హైదరాబాద్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ గులాబీ కేంద్రంగా దాడులు చేపట్టడం విస్తు పోయేలా చేస్తోంది.
బలిదానాలు, ఆత్మ త్యాగాలతో ఏళ్ల తరబడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ సకల అవలక్షణాలకు కేంద్ర బిందువుగా మారడం బాధను కలిగిస్తోంది. ఏ
నేరం జరిగినా లేదా ఏ స్కామ్ చోటు చేసుకున్నా అది చివరకు తెలంగాణతో ముడి పడి ఉంటోంది.
తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీకి దగ్గరి బంధువుగా భావిస్తున్న శ్రీనివాస్ రావును ఉన్నట్టుండి ఈడీ అదుపులోకి తీసుకుంది.
40 చోట్ల దాడులు చేసినా చివరకు రియల్ ఎస్టేట్ పేరుతో అడ్డగోలు దందాలు చేపట్టిన అతడిని ఆరు గంటల పాటు విచారించింది. రాత్రి 10.30 గంటల దాకా ప్రశ్నించింది.
ఇంట్లో తనిఖీలు చేసిన ఈడీ తమ స్వంత వాహనంలో తీసుకు వెళ్లడం చర్చకు దారితీసింది. రియల్ ఎస్టేట్, సాఫ్ట్ వేర్ కంపెనీల ముసుగులో మనీ
ల్యాండరింగ్ జరిగినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది.
బంజారా హిల్స్ లోని జోనా ట్రావెల్స్ , రామంతాపూర్ లో సాలిగ్రామ్ కంపెనీ, మాదాపూర్ లోని వరుణ్ సన్ కంపెనీ, మేడ్చల్ లోని సుచిత్ర లో మరో ఐటీ కంపెనీలో ఈడీ తనిఖీలు చేపట్టంది.
ఇక సాలిగ్రామ్ కంపెనీని ఎమ్మెల్సీ కవిత ప్రారంభోత్సవం చేశారు. ఇందులో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని తేల్చింది.
శ్రీనివాస్ రావు(Vennamaneni Srinivasa Rao) పలువురు రాజకీయ నేతలకు బినామీగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది.
సీఏ బుచ్చిబాబు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగింది ఈడీ. 14 షెల్ కంపెనీలకు చెందిన లావా దేవీలను , డాక్యుమెంట్లను సీజ్ చేసింది. ఎప్పుడు పిలిచినా రావాల్సి ఉంటుందని శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చారు.
రోడ్ నెంబర్ 12 , ఎమ్మెల్యే కాలనీ అడ్రస్ పేరుతో పలు కంపెనీలు శ్రీనివాసరావు రిజిస్టర్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. ఇక సీఏ బుచ్చిబాబు ఎంతో
మంది ప్రముఖులకు ఆడిటర్ గా ఉన్నట్లు గుర్తించింది.
రాబిన్ డిస్టలీరీస్ చిరునామాతో రిజిస్టర్ అయిన అనూస్ బ్యూటీ పార్లర్ డైరెక్టర్ గా బోయినపల్లి అభిషేక్ రావు డైరెక్టర్ గా ఉన్నాడు.
మాదాపూర్ లో ని బ్యూటీ పార్లర్ , రాయదుర్గంలోని అభిషేక్ రావు ఆఫీస్ , నానక్ రాం గూడకు చెందిన ప్రేమ్ సాగర్ రావు ఆఫీసులో సోదాలు చేపట్టింది.
అభిషేక్ రావు , గండ్ర ప్రేమ్ సాగర్ రావుకు శ్రీనివాస్ రావు సమీప బంధువు కావడం విశేషం. ఇతడికి అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
Also Read : వెన్నమనేని మామూలోడు కాదప్పా