T Rama Rao : చిత్ర నిర్మాత టి. రామారావు క‌న్నుమూత‌

ఆయ‌న‌కు 84 ఏళ్ల వ‌య‌సు

T Rama Rao : ప్ర‌ముఖ చిత్ర నిర్మాత టి. రామారావు బుధ‌వారం చెన్నైలో క‌న్ను మూశారు. ఆయ‌న‌కు 84 ఏళ్లు. నంద‌మూరి తార‌క రామారావు, అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి ప్ర‌ముఖ న‌టుల‌తో తెలుగు, హిందీ భాష‌ల్లో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందించారు.

ఇవాళ తెల్ల‌వారుజామ‌ను స్వ‌ర్గ‌స్తులైన‌ట్లు ఆయ‌న కుటుంబీకులు వెల్ల‌డించారు. వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణించిన‌ట్లు తెలిపారు. టి. రామారావుగా(T Rama Rao) ఆయ‌న సుప్రసిద్దులు. నాలుగు ద‌శాబ్దాలుగా ఆయ‌న సినీ రంగంలో ఉన్నారు.

ఎన్నో సామాజిక ఇతివృత్తాల‌తో సినిమాలు తీశారు. మంచి పేరు తెచ్చుకున్నారు. టి. రామారావు 1966లో అక్కినేని నాగేశ్వ‌ర్ రావు, సావిత్రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెలుగులో న‌వ‌రాత్రి అనే చిత్రాన్ని నిర్మించారు.

లెజండ‌రీ యాక్ట‌ర్ ఎన్టీఆర్ తో 1977లో ఫాంట‌సీ కామెడీ చిత్రం జ‌య‌ప్ర‌ద‌తో య‌మ‌గోల సినిమాను తీశారు. దీనికి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కుడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

రామారావు 1985లో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ప‌చ్చ‌ని కాపురంలో కృష్ణ‌, శ్రీ‌దేవి ప్ర‌ధాన తార‌గ‌ణంతో నిర్మించారు. ఈ చిత్రంలోని పాట‌లు నేటికీ వింటూ ఉంటారు. హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సైతం ఆయ‌న సినిమాలు నిర్మించ‌డం విశేషం.

ఆయ‌న నిర్మించిన చిత్రాల‌లో చూస్తే అమితాబ్ బ‌చ్చ‌న్ , ర‌జ‌నీకాంత్ , హేమా మాలినితో అంధా కానూన్ నిర్మించారు. దాంతో పాటు ఏక్ హి భుల్ , జంగ్ , బులంది, ఖ‌త్రోన్ కే ఖిలాడీ సినిమాలు ఉన్నాయి.

ఖత్రోన్ కే ఖిలాడీ మూవీలో ధ‌ర్మేంద్ర‌, సంజ‌య్ ద‌త్ , మాధురీ దీక్షిత్, చుంకీ పాండే న‌టించారు. తాతినేని రామారావు మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

ప్ర‌ముఖ న‌టులు అమితాబ్ బ‌చ్చ‌న్ ,ర‌జ‌నీకాంత్ , అజ‌య్ దేవ‌గ‌న్ తో పాటు తెలుగు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

Also Read : మగబిడ్డ కు జ‌న్మ‌నిచ్చిన కాజ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!