Vichitra Slams : తమిళనాడు – ప్రముఖ నటుడు , టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై షాకింగ్ కామెంట్స్ చేశారు తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటి విచిత్ర. బిగ్ బాస్ తమిళ ప్రోగ్రాం సందర్బంగా ఆమె కంటెస్టెంట్స్ తో తన అనుభవాలను పంచుకున్నారు.
Vichitra Slams Balakrishna
టాలీవుడ్ కు చెందిన దివంగత నటుడు ఎన్టీఆర్ తనయుడు బాలయ్య బాబుపై సంచలన ఆరోపణలు చేశారు విచిత్ర. ఆయనపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడం కలకలం రేపింది. 2001లో బాలకృష్ణతో కలిసి విచిత్ర(Vichitra) భేలేవాడివి బాసు లో నటించింది. ఈ మూవీలో విచిత్ర కీలక రోల్ పోషించింది.
షూటింగ్ అయి పోయాక పదే పదే తనను రూమ్ లోకి రావాలంటూ పిలిచాడని తెలిపింది. అంతే కాదు వెళ్లక పోతే తను ఉంటున్న రూమ్ కు వచ్చి పదే పదే తలుపులు బాదాడంటూ ఆరోపించింది.
ఆ సమయంలో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రతి రోజూ తాను నరకం అనుభవించానని వాపోయింది విచిత్ర. సెట్ లో సైతం తనను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకునే వాడంటూ మండిపడింది. ఈ విషయం గురించి దర్శకుడికి చెప్పానని పట్టించు కోలేదని ఫైర్ అయ్యింది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో విచిత్రతో పాటు శిల్పా శెట్టి, అంజలా జువేరీ కూడా నటించడం విశేషం. ఈ ఒక్క సంఘటనతో తాను సినిమాలకు దూరంగా ఉన్నానంటూ పేర్కొనడం గమనార్హం.
Also Read : BRS Scams : బీఆర్ఎస్ స్కాంలు రూ. 4 లక్షల కోట్లు