Victoria Gowri SC : పిటిష‌న్ కొట్టివేత హైకోర్టు జ‌డ్జిగా గౌరి

న్యాయ‌మూర్తిగా ప్ర‌మాణ స్వీకారం

Victoria Gowri SC : మ‌ద్రాస్ హైకోర్టు న్యాయ‌మూర్తిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు విక్టోరియా గౌరి. ఆమె అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, రాజ్యాంగ విలువలు, సూత్రాల‌కు విరుద్ద‌మ‌ని అందుకే ఆమె నియామ‌కం చెల్ల‌దంటూ మ‌ద్రాస్ హైకోర్టుకు చెందిన ప‌లువురు న్యాయ‌వాదులు అభ్యంత‌రం తెలిపారు. ఆపై విక్టోరియా గౌరి(Victoria Gowri SC) నియామ‌కాన్ని వెంట‌నే నిలిపి వేయాలంటూ భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానంను ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టింది.

ఇది పూర్తిగా అసంబ‌ద్ద‌మంటూ పేర్కొంటూ దావాను బుట్ట‌లో పడేసింది. దీంతో నిన్న‌టి దాకా ఉత్కంఠ రేపిన విక్టోరియా గౌరి నియామ‌కానికి ఉన్న అడ్డంకి తొల‌గి పోయింది. అంతే కాదు గౌరి భార‌తీయ జ‌న‌తా పార్టీకి అనుబంధంగా ఉన్న‌ట్లు కూడా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

విచార‌ణ కొన‌సాగుతూ ఉండ‌గానే విక్టోరియా గౌరి(Victoria Gowri SC) ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ పిటిషన్ చెల్లుబాటు కాదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తాము రిట్ పిటిష‌న్ల‌ను స్వీక‌రించ‌డం లేదు. కార‌ణాలు చెప్పాల్సిన ప‌ని లేద‌ని పేర్కొన్నారు జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా. అర్హ‌త‌పై స‌వాల్ చేయ‌డంలో త‌ప్పు లేదు. 

కానీ అనుకూల‌త అవునా కాదా అన్న విష‌యం న్యాయ స్థానం ప‌రిధి లోకి రాకూడ‌ద‌ని ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఖ‌న్నా పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా మ‌ద్రాస్ హైకోర్టుకు చెందిన కొంద‌రు బార్ స‌భ్యులు గౌరీని హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా నియ‌మించాల‌ని చేసిన సిఫార‌సును రీకాల్ చేయాల‌ని కోరుతూ సీజేఐ ధ‌నంజ‌య చంద్ర‌చూడ్ కు లేఖ రాశారు.

Also Read : ఆర్థిక నేర‌స్థుల‌కు ఆమెంటే హ‌డల్

Leave A Reply

Your Email Id will not be published!