Videocon Fraud Case : చందా..వేణుగోపాల్ కస్టడీ పొడిగింపు
చందా కొచ్చర్ భర్త కు కూడా
Videocon Fraud Case : మనీ లాండరింగ్ కు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఇఓ చందా కొచ్చర్, భర్త తో పాటు తాజాగా అరెస్ట్ అయిన వీడియోకాన్ గ్రూప్ సంస్థల (Videocon Fraud Case) చైర్మన్ వేణుగోపాల్ దూత్ లకు సంబంధించి కస్టడీని డిసెంబర్ 29 వరకు పొడిగించింది కోర్టు. 2009 నుంచి 2011 మధ్య ఐసీఐసీఐ బ్యాంకు వీడియోకాన్ గ్రూప్ కు ఇచ్చి న రూ. 1,875 విలువైన ఆరు రుణాల మంజూరులో అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందని ఈడీ పేర్కొంది.
ఇందులో ప్రధాన పాత్ర చందా కొచ్చర్, ఆమె భర్త ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ మనీ లాండరింగ్ కు సంబంధించి అదుపులోకి తీసుకుంది. కోర్టులో హాజరు పర్చింది. అయితే కస్టడీకి ఇవ్వాలని కోరగా నేటి వరకు మాత్రమే గడువు ఉంది. దీంతో మరోసారి విచారణ జరిపేందుకు గాను కస్టడీ కావాలని సీబీఐ కోరడంతో కోర్టు ఓకే చెప్పింది.
కాగా మాజీ ఎండీ, సీఇఓ చందా కొచ్చర్ , భర్త దీపక్ కొచ్చర్ మనీ లాండరింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఆమెతో పాటు వేణుగోపాల్ దూత్ కూడా ఉన్నారు. ఐసీసీఐ బ్యాంకు – వీడియోకాన్ మోసం కేసులో ముగ్గురిని మరో రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది.
దీపక్ , సుప్రీమ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ , వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ , వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నూపవర్ రెన్యూవబుల్స్ సంస్థలతో పాటు కొచర్స్ , ధూత్ లను సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2019 పీనల్ కోడ్ కింద వీరిని చేర్చింది.
Also Read : విమాన ఛార్జీలను నియంత్రించలేం
