Vijay Devarakonda : విజయ్ తో పరుశురామ్ సినిమా
రౌడీ సరసన మృణాల్ ఠాకూర్
Vijay Devarakonda : సక్సెస్ ఫుల్ దర్శకుడు పరుశురామ్ కాంబినేషన్ లో మరోసారి విజయ్ దేవరకొండ నటించనున్నారు. బుధవారం ఇంకా పేరు పెట్టని సినిమాకు క్లాప్ కొట్టారు. విజయ్ కు ఇది 13వ సినిమా. ఇప్పటికే నటి సమంతతో కలిసి సినిమా చేస్తున్నాడు. పరుశురామ్ గతంలో రష్మిక మందానతో కలిసి విజయ్ తో గీత గోవిందమ్ చిత్రం తీశాడు. ఇది బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచింది. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ రేంజ్ పెరిగింది విజయ్ దేవరకొండకు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ అంతగా ఆడలేదు. ప్రస్తుతం రాబోయే సినిమాపై ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నాడు రౌడీ బాయ్.
సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కేవలం కుటుంబ ప్రాధాన్యత చిత్రాలు తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు దిల్ రాజు. ప్రస్తుతం విజయ్ సినిమాకు ఆయనే నిర్మాత కావడం విశేషం. దీంతో భారీ అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. ఎందుకంటే పరుశురామ్ దర్శకత్వంలో ఇటీవల ప్రిన్స్ మహేష్ బాబు తో తీసిన సినిమా సర్కార్ వారి పాట సూపర్ సక్సెస్ అయ్యింది.
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఖుషీ తో పాటు మరో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఇందులో శ్రీలీల నటించనున్నట్లు టాక్. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించి ఎక్కడా సమాచారం లేదు. ఉన్నట్టుండి ఓపెనింగ్ చేయడం విస్తు పోయేలా చేసింది సినీ వర్గాలను. ఇక పరుశురాం టేకింగ్, డైలాగ్ డెలివరీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక రౌడీ బాయ్ కి జంటగా మృణాల్ ఠాకూర్ నటించనుంది.
Also Read : Chiranjeevi : చెర్రీ..ఉపాసనకు ‘మెగా’ అభినందన