Vijay Devarakonda : సమంత అంటే చచ్చేంత ఇష్టం
సారీ సారా అలీ ఖాన్..జాన్వీ కపూర్
Vijay Devarakonda : రౌడీ హీరోగా ఇప్పటికే పాపులర్ అయ్యాడు తెలుగు వాడైన విజయ్ దేవరకొండ. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ డిస్నీ హాట్ స్టార్ లో ప్రముఖ హీరో హీరోయిన్లు, స్టార్లతో కాఫీ విత్ కరణ్ 7 పేరుతో ప్రోగ్రాం చేస్తున్నాడు.
మొన్న సమంత రుత్ ప్రభు, అక్షయ్ కుమార్ తో పూర్తి చేస్తే తాజాగా విజయ్ దేవర కొండ, అనన్య పాండేతో చేశాడు కరణ్ జోహార్. ఈ సందర్భంగా పలు కీలక ప్రశ్నలకు జవాబు ఇచ్చాడు. విజయ్ ఇచ్చిన ఆన్సర్స్ హల్ చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో.
ఈ సందర్బంగా ఓ ప్రశ్నకు సమాధానంగా సమంత అంటే తనకు మోస్ట్ డిజైరబుల్ అని చెప్పాడు. కాగా సారా అలీ ఖాన్ , జాన్వీ కపూర్ లు ప్లీజ్ క్షమించండి అంటూ పేర్కొనడం కలకలం రేపింది.
ర్యాపిడ్ ఫైర్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. జున్ను అంటే నీకు ఇష్టమా అని అడిగాడు. సారా, జాన్వీ ఇద్దరూ నీపై ప్రేమను కలిగి ఉన్నారని చెప్పాడు.
అయ్యో అలాగా నన్ను ఎవరు ఇష్ట పడుతున్నారో నాకు ఎలా తెలుస్తుందన్నాడు. సారా అలీ ఖాన్ , జాన్వీ కపూర్ ఇద్దరూ ఆకర్షణీయంగా ఉన్నారని చెప్పాడు.
అంతే కాదు జాన్వీ కపూర్ ను రెండుసార్లు కలిశానని తెలిపాడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). భారత దేశంలో అత్యంత ఇష్టపడే అమ్మాయిలలో నీకు ఎవరంటే ఇష్టమని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు తనకు సమంత రుత్ ప్రభు అంటే ఇష్టమని కుండ బద్దలు కొట్టాడు.
ఆమె డార్లింగ్. అద్భుతమైనది. నమ్మ శక్యం కాని మహిళ అని కితాబు ఇచ్చాడు విజయ్ దేవరకొండ. జాన్వీని క్యూట్ అంటూ అభివర్ణించాడు.
Also Read : సెగలు పుట్టిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక అందాలు