Vijay Devarakonda Mother : విజ‌య్..అన‌న్య‌తో ‘త‌ల్లి’ పూజ‌లు

నెట్టింట్లో ఫోటోలు హ‌ల్ చ‌ల్

Vijay Devarakonda Mother : డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రౌడీ హీరోగా పేరొందిన విజ‌య్ దేవ‌ర కొండ‌, అన‌న్య పాండే క‌లిసి లైగ‌ర్ సినిమాలో న‌టించారు. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

చిత్ర యూనిట్ లైగ‌ర్ మూవీ ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉన్నారు. తాజాగా అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ల్లి మాధ‌వి దేవ‌ర‌కొండ బుధ‌వారం హైద‌రాబాద్ లోని వారి ఇంట్లో పూజ‌లు చేసింది.

త‌న కుమారుడు , అన‌న్య మ‌ణిక‌ట్టుపై ప‌విత్ర బ్యాండ్ లు క‌ట్టింది. ఈ సంద‌ర్బంగా పూజ‌లు చేసిన ఫోటోల‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండేలు త‌మ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

దేశ వ్యాప్తంగా మేము ప్ర‌మోష‌న్ చేస్తున్నాం. ఈ త‌రుణంలో మా అమ్మ‌, నాన్న‌ల ఆశీస్సులు తీసుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

మేము టూర్ చేస్తున్న ప్ర‌తిసారి మా అమ్మ మాధవి దేవ‌ర‌కొండ(Vijay Devarakonda Mother) ప్ర‌శాంతంగా నిద్ర పోతుంద‌ని తాను భావిస్తున్న‌ట్లు తెలిపాడు రౌడీ హీరో. ఇదే స‌మ‌యంలో న‌టి అన‌న్య పాండే కూడా త‌న అనుభ‌వాన్ని పంచుకుంది.

విజ‌య్ అమ్మ గారి నుండి దీవెన‌లు అందుకున్నా. లైగ‌ర్ స‌క్సెస్ కావాల‌ని పూజ‌లు చేశారు. ధ‌న్య వాదాలు తెలియ చేసుకుంటాన‌ని తెలిపింది. కాగా ఆగ‌స్టు 25న దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా లైగ‌ర్ విడుద‌ల కానుంది.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే లైగ‌ర్ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్లు, ట్రైల‌ర్, సాంగ్స్ దుమ్ము రేపుతున్నాయి. తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, త‌మిళం, హిందీలో దీనిని రిలీజ్ చేయ‌నున్నారు.

Also Read : జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఈడీ షాక్

Leave A Reply

Your Email Id will not be published!