Vijay Sai Reddy : 40 ఏళ్లుగా ప్రజా ధనం లూటీ
ఎంపీ విజయ సాయి రెడ్డి కామెంట్
Vijay Sai Reddy : వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని ఏకి పారేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకనాడు కేవలం 2 ఎకరాల ఆస్తి మాత్రమే కలిగిన నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy). ఎంత కష్టం చేస్తే ఇన్ని కోట్లు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
Vijay Sai Reddy Slams Chandrababu
నారా చంద్రబాబు నాయుడు మామూలోడు కాదని, ఆయన కరడు గట్టిన ఆర్థిక నేరస్థుడని ఆరోపించారు ఎంపీ. ఆయన గత 40 ఏళ్లుగా ఇష్టానుసారం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఊరేగాడని, ప్రజా ధనాన్ని దోచుకున్నాడని, ఒక రకంగా చెప్పాలంటే గజ దొంగ అని ఆరోపించారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
ఢిల్లీకి వెళ్లి ఆర్తనాదాలు చేస్తున్న వారికి, కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టే వారికి , ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసే పెయిడ్ బ్యాచ్ లకు చంద్రబాబు నాయుడు చేసిన దురాగతాలు ఏమిటో తెలుసు కోవాలని సూచించారు.
బాబుకు మద్దతు పలకడం అంటే అవినీతి, అక్రమాలకు మద్దతు ఇవ్వడం తప్ప మరొకటి కాదన్నారు.
Also Read : CP CV Anand : ముస్లిం మత పెద్దలకు థ్యాంక్స్