Vijay Sethupathi : కేవలం బాద్ షా కోసం నటించా – సేతుపతి
డబ్బుల కోసం పని చేయలేదు
Vijay Sethupathi : తమిళ సినీ నటుడు విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైనమిక్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో కలిసి నటించాడు విజయ్ సేతుపతి. ఇప్పటికే సినిమాకు భారీ ఎత్తున ఆదరణ లభిస్తోంది. పఠాన్ బిగ్ సక్సెస్ తర్వాత బాద్ షా నటిస్తున్న చిత్రం జవాన్. పోస్టర్స్ , టీజర్ , సాంగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రధానంగా టేకింగ్ లో , మేకింగ్ లో మోస్ట్ పాపులర్ డైరెక్టర్ గా ఇప్పటికే పేరు పొందాడు అట్లీ. అతడు తీసిన ప్రతి మూవీ ఓ సెన్సేషన్. సందేశంతో పాటు డిఫరెంట్ మేనరిజంను ప్రదర్శించేలా చేయడంలో తనకు తనే సాటి.
అట్లీలోని స్పార్క్ ను గమనించాడు బాద్ షా షారుక్ ఖాన్. ఈ మేరకు అతడి కాంబినేషన్ లో జవాన్ దుమ్ము రేపుతోంది. ఈ సందర్బంగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) షారుక్ ఖాన్ గురించి ఆకాశానికి ఎత్తేశాడు. ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఎక్కడా డాబు దర్పం కనిపంచ లేదంటూ కితాబు ఇచ్చాడు.
ప్రస్తుతం విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తోటి నటుల పట్ల ఆప్యాయత, అనురాగం కలిగి ఉండడం మామూలు విషయం కాదన్నాడు. చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చిన వాడు కావడం వల్లనేమో తన పట్ల మరింత ప్రేమను కనబర్చాడంటూ ఆనందం వ్యక్తం చేశాడు విజయ్ సేతుపతి.
Also Read : Yogi Adityanath : వరదల నివారణకు చర్యలు – యోగి
