Vijayakanth Tribute : విజయకాంత్ మృతి తీరని లోటు
ప్రముఖుల నివాళి..మోదీ సంతాపం
Vijayakanth Tribute : తమిళనాడు – ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ చీఫ్ విజయకాంత్ అనారోగ్య కారణంతో 71 ఏళ్ల వయసులో గురువారం కన్ను మూశారు. ఆయన మృతితో తీవ్ర విషాదం అలుముకుంది రాష్ట్ర వ్యాప్తంగా. మియోట్ ఆస్పత్రి పూర్తిగా అభిమానులతో నిండి పోయింది. ఇసుక వేస్తే రాలనంత జనం తమ అభిమాన నటుడిని చూసేందుకు బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇవాళ రాష్ట్రంలోని థియేటర్లలో షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Vijayakanth Tribute today
ఇదిలా ఉండగా విజయకాంత్ ను అందరూ కెప్టెన్ అని పిలుచుకుంటారు. ఆయన 1952 ఆగస్టు 25న మదురైలో పుట్టారు. 2005 సెప్టెంబర్ 14న డీఎండీకే పేరుతో పార్టీని స్థాపించారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన తన సినీ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు.
చివరి సారిగా 2018లో మధుర వీరన్ సినిమాలో నటించారు. విలక్షణమైన నటుడిగా పేరు పొందారు. వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. విజయకాంత్(Vijayakanth) మృతితో తమిళ సినిమాలో విషాదం అలుముకుంది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. సీఎం స్టాలిన్ విజయకాంత్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read : Actor Vijayakanth : నటుడు విజయకాంత్ కన్నుమూత