Vijayendra Prasad RRR Sequel : ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్

క‌థా ర‌చ‌యిత విజయేంద్ర ప్ర‌సాద్

Vijayendra Prasad RRR Sequel : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. విడుద‌లైన ఈ మూవీ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టింది. బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది. రికార్డుల మోత మోగించింది. లెక్క‌లేన‌న్ని అవార్డులు, పుర‌స్కారాలు ద‌క్కాయి ఈ చిత్రానికి. ప్ర‌త్యేకించి ఇందులో న‌టించిన జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ తో పాటు ఆలియా భ‌ట్ న‌టించారు. సినిమాకు అంత‌ర్జాతీయ ప‌రంగా ఆస్కార్ అవార్డు ద‌క్కింది. చంద్ర‌బోస్ రాసిన పాట నాటు నాటు కు ఆస్కార్ అవార్డు ల‌భించింది. దీనికి ఎంఎం కీర‌వాణి సంగీతం అందించారు.

భారీ ఎత్తున ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి సీక్వెల్ వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ మ‌ధ్య‌న ద‌ర్శ‌కుడు రాజ మౌళి అలాంటి ఆలోచ‌న లేద‌ని పేర్కొన్నాడు. ఆయ‌న ఫుల్ బిజీగా మారాడు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ప్రిన్స్ మహేష్ బాబుతో అడ్వెంచ‌ర్ తో సినిమా తీస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ కు సంబంధించి షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసిన‌ట్లు టాక్.

తాజాగా రాజ‌మౌళికి తండ్రి గా ఉన్న క‌థా ర‌చ‌యిత‌, రాజ్య‌స‌భ ఎంపీ విజ‌యేంద్ర ప్ర‌సాద్(Vijayendra Prasad) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. సోమ‌వారం ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి సీక్వెల్ ఉండ‌బోతోంద‌ని తెలిపాడు. దీనిని ఎస్ఎస్ రాజ‌మౌళి లేదా ఆయ‌న సార‌థ్యంలో ఇంకొక‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఛాన్స్ ఉంద‌న్నాడు.

Also Read : S Jai Shankar : ఎస్ జై శంక‌ర్ నామినేష‌న్ దాఖ‌లు

 

Leave A Reply

Your Email Id will not be published!