Vikas Raj : గవర్నర్ కు విజేతల జాబితా
అందజేయనున్న సిఈవో
Vikas Raj : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెల్లడి అయ్యాయి. చెదురు మదురు సంఘటనలు, కేసులు మినహా పూర్తిగా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. విజేతలను కూడా ప్రకటించారు వికాస్ రాజ్. కాంగ్రెస్ పార్టీకి(Congress) 64 సీట్లు రాగా భారత రాష్ట్ర సమితి పార్టీకి 39 మంది, భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు, ఎంఐఎం 7 సీట్లు, సీపీఐ ఒక సీటుతో గెలుపొందారు.
Vikas Raj Updates
ఈ మొత్తం గెలుపొందిన అభ్యర్థులు, పోలైన ఓట్లు, ఎంత మెజారిటీతో , ఎవరెవరు గెలుపొందారనే దానిపై పూర్తి వివరాలతో కూడిన జాబితా, నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్. నివేదిక అందిన అనంతరం కొత్త గవర్నర్ పరిశీలించనున్నారు.
అనంతరం కొత్త శాసన సభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. సాయంత్రం తర్వాత పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఇస్తామని రాజ్ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వైపు సీఎల్పీ నేతను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఎవరిని సీఎంగా చేయాలనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : Seethakka : నా విజయం ప్రజలకు అంకితం