Seethakka : నా విజ‌యం ప్ర‌జ‌ల‌కు అంకితం

ములుగు ఎమ్మెల్యే దాసరి సీత‌క్క‌

Seethakka : హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ములుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి భారీ మెజారిటీతో విజ‌యం సాధించిన దాస‌రి సీత‌క్క(Seethakka) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం సీఎల్పీ మీటింగ్ కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తాను కూడా మంత్రివ‌ర్గం రేసులో ఉన్నాన‌ని, సీఎం పోస్టు కోసం పోటీ ప‌డ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు సీత‌క్క‌.

Seethakka’s Winning Comment

త‌న‌ను ఓడించేందుకు కేసీఆర్ క‌చ‌రా బ్యాచ్ ప్ర‌య‌త్నం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆశీస్సుల‌తో తాను గెలుపొందాన‌ని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ , స‌త్య‌వ‌తి రాథోడ్ క‌లిసి తమ బినామీల‌తో రూ. 100 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని కానీ ప్ర‌జ‌లు త‌న‌ను విశ్వ‌సించార‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటూ రాచ‌రిక పాల‌న సాగించిన దొరను ఫామ్ హౌస్ కు పంపించార‌ని ఇది ముమ్మాటికీ ప్ర‌జ‌లు సాధించిన విజ‌య‌మ‌ని సీత‌క్క అభివ‌ర్ణించారు. త‌న‌ను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకునేలా ఇబ్బందుల‌కు గురి చేశార‌ని కానీ కాలం త‌న వైపు నిలిచింద‌న్నారు.

Also Read : Telangana CLP Meeting : సీఎల్పీ నేత ఎంపికపై ఉత్కంఠ‌

Leave A Reply

Your Email Id will not be published!