Vinod Roy : అనిల్ కుంబ్లే పై బాంబు పేల్చాడు వినోద్ రాయ్. ఆయన భారత జట్టుకు ఎందుకు కోచింగ్ పదవి నుంచి తప్పుకున్నాడో తాను రాసిన పుస్తకంలో తెలిపాడు.
కుంబ్లే మితి మీరిన క్రమశిక్షణనే ప్రధాన కారమని, దీంతో కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు భయపడ్డారని పేర్కొన్నాడు. బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ హెడ్ గా పని చేశారు వినోద్ రాయ్.
ఆయన ఇటీవల నాట్ జస్ట్ ఎ నైట్ వాచ్ మన్ మై ఇన్నింగ్స్ విత్ బీసీసీఐ అనే పేరుతో పుస్తకం ప్రచురించారు. తాను 33 నెలల పాటు బీసీసీఐలో ఉన్నారు.
ఈ కాలంలో వివిధ సమస్యలపై ప్రస్తావించారు. అనిల్ కుంబ్లే క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. జట్టు సభ్యులు సంతోషంగా లేరని కోహ్లీ తనతో చెప్పాడని తెలిపాడు. అయితే కుంబ్లే తాను బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని భావించాడని పేర్కొన్నాడు వినోద్ రాయ్(Vinod Roy ).
2017లో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన రాజీనామాను బహిరంగంగా ప్రకటించిన కుంబ్లేతో సంబంధాలు తెగి పోయాయని కోహ్లీ ఫిర్యాదు చేశారు. బీసీసీఐ చరిత్రలో అది వివాదాస్పదంగా మారింది.
2016లో కుంబ్లేకు హెడ్ కోచ్ గా ఏడాది పాటు కాంట్రాక్టు దక్కింది. కెప్టెన్ , టీమ్ మేనేజ్ మెంట్ తో నా సంభాషణల్లో కుంబ్లే అత్యంత కఠినంగా ఉంటాడన్న అభిప్రాయం వ్యక్తమైందని తెలిపాడు వినోద్ రాయ్(Vinod Roy ).
సచిన్ టెండూల్కర్ , సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన అప్పటి అడ్వైజరీ కమిటీ కంబ్లేను తిరిగి నియమించాలని సిఫారసు చేసిందని తెలిపాడు.
జట్టులో క్రమశిక్షణ , వృత్తి నైపుణ్యాన్ని తీసుకు రావడం కోచ్ ప్రధాన విధి. సీనియర్ గా జట్టు కెప్టెన్ తో పాటు ఆటగాళ్లు గౌరవించాల్సిందేనని తెలిపారు వినోద్ రాయ్.
Also Read : పంత్ లా ఆ షాట్ ఆడాలని ఉంది