Virat Kohli Record : స‌చిన్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

21 సెంచరీల‌తో స్టార్ ప్లేయ‌ర్ కు చెక్

Virat Kohli Record : వ‌ర‌ల్డ్ మోస్ట్ పాపుల‌ర్ క్రికెట‌ర్ గా పేరొందిన మెషీన్ గ‌న్ విరాట్ కోహ్లీ అద్భుత‌మైన రికార్డ్ నమోదు చేశారు. భార‌త గ‌డ్డ‌పై ఏకంగా 21 సెంచ‌రీలతో అరుదైన ఘ‌న‌త సాధించాడు. భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ భార‌త్ లో 20 సెంచ‌రీలు చేశాడు.

ఈ రికార్డును తిరువ‌నంత‌పురం వేదిక‌గా శ్రీ‌లంక‌తో జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్ లో అధిగ‌మించాడు విరాట్ కోహ్లీ. ఏకంగా 166 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. దీంతో ఈ సెంచ‌రీతో క‌లుపుకుని విరాట్ కోహ్లీ(Virat Kohli Record) భార‌త్ లో 21 సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు.

ఇదే శ్రీ‌లంక‌తో జ‌రిగిన టీ20 సీరీస్ లో ఆడ‌లేదు కోహ్లీ. కానీ శ్రీ‌లంక‌తో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు. సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. కేవ‌లం 80 బంతుల్లో సెంచ‌రీ చేసిన కోహ్లీ 87 బంతులు ఆడి 113 ర‌న్స్ చేసి చివ‌రి ఓవ‌ర్ లో ఔట‌య్యాడు. మొత్తం 12 ఫోర్లు ఒక సిక్స్ కొట్టాడు.

భార‌త జ‌ట్టు 67 ర‌న్స్ తో విజ‌యం సాధించింది. కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జ‌రిగిన రెండో వ‌న్డేలో నిరాశ ప‌రిచాడు కోహ్లీ కేవ‌లం 4 ప‌రుగుల‌కే ఔట‌య్యాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక మూడో వ‌న్డేలో భార‌త్ జ‌ట్టు ఏకంగా 390 ప‌రుగుల భారీ స్కోర్ న‌మోదు చేసింది.

రోహిత్ శ‌ర్మ 42 ర‌న్స్ చేసి ఔట్ అయ్యాక మైదానంలోకి వ‌చ్చిన కోహ్లీ లంకేయుల‌కు చుక్క‌లు చూపించాడు. ఇక వ‌న్డేల్లో 258 ఇన్నింగ్స్ ల్లో 12,600 ప‌రుగులు దాటిన విరాట్ కోహ్లీ అతి త‌క్కువ మ్యాచ్ ల్లో మైలు రాయిని అధిగ‌మించాడు.

Also Read : 100 సెంచ‌రీలు కోహ్లీకి సాధ్యం

Leave A Reply

Your Email Id will not be published!