Kohli De Villiers : గిల్ ఆటకు కోహ్లీ..డివిలియర్స్ ఫిదా
చెప్పేందుకు మాటలు రావడం లేదు
Kohli De Villiers : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో దుమ్ము రేపిన శుభ్ మన్ గిల్ ఆట తీరుకు క్రికెటర్లు జేజేలు పలుకుతున్నారు. అసాధారణమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. కళ్లు చెదిరే షాట్స్ తో దుమ్ము రేపాడు. కేవలం 60 బంతులు ఎదుర్కొన్న శుభ్ మన్ గిల్ 7 ఫోర్లు 10 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 129 రన్స్ చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓ వైపు ప్రత్యర్థి జట్టు స్కిప్పర్ రోహిత్ శర్మ గిల్ ను అభినందిస్తే ..భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Kohli), ఏబీ డివిలియర్స్ అతడి ఆట తీరు గురించి మాటలు రావడం లేదని పేర్కొన్నారు.
మ్యాచ్ అనంతరం గిల్ గురించి ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ యంగ్ క్రికెటర్ కు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. ఐపీఎల్ పుణ్యమా అని మెరికల్లాంటి ఆటగాళ్లు రాణిస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా ఈసారి ఐపీఎల్ లో మూడు సెంచరీలు చేశాడు. అంతే కాదు ప్లే ఆఫ్స్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా శుభ్ మన్ నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిప్పులు చెరిగింది. ఏకంగా భారీ స్కోర్ నమోదు చేసింది. కేవలం 3 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 233 పరుగులు చేసింది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో బిగ్ టార్గెట్ కావడం ఇదే.
Also Read : Rohit Sharma Gill
