Kohli Duplessis : ఆ ముగ్గురు రాణించినా త‌ప్ప‌ని ఓట‌మి

విరాట్ కోహ్లీ..డుప్లెసిస్..లోమ్ రోర్ సూప‌ర్

Kohli Duplessis :  ఐపీఎల్ 16వ సీజ‌న్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్ బెంగ‌ళూరు అద్భుతంగా రాణించినా చివ‌ర‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొట్టిన దెబ్బ‌కు ఠారెత్తి పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 181 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఢిల్లీ కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి 187 ర‌న్స్ చేసింది . 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ప్ర‌ధానంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్లు రెచ్చి పోయారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. డేవిడ్ వార్న‌ర్ , మిచెల్ మార్ష్ రాణించ‌గా ఫిల్ సాల్ట్ దంచి కొట్టాడు. 87 ర‌న్స్ తో రెచ్చి పోయాడు. 6 సిక్స‌ర్లు 8 ఫోర్లు దంచి కొట్టాడు. సిక్సులు, ఫోర్ల‌తో క‌లిపి 68 ర‌న్స్ చేశాడు .

అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జ‌ట్టులో స్టార్ క్రికెట‌ర్ , మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రోసారి మెరిశాడు. బాధ్య‌తాత‌యుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. 55 ర‌న్స్ చేశాడు. అత‌డితో పాటు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స‌త్తా చాటాడు(Kohli Duplessis) . ఢిల్లీ బౌల‌ర్ల దెబ్బ‌కు వికెట్లు రాలుతున్నా మ‌హిపాల్ లోమ్ రోర్ సెన్సేష‌న్ ఇన్నింగ్స్ తో స‌త్తా చాటు. 54 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. దీంతో గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ చేసింది.

ఇక ఆఖ‌రులో ఖ‌లీల్ అహ్మ‌ద్ వేసిన 20వ ఓవ‌ర్ లో తొలి బంతికి దినేష్ కార్తీక్ 11 ప‌రుగులు చేసి వెనుదిరిగాడు. ఆఖ‌రి బంతికి ప‌రుగు రాలేదు. దీంతో 181కే ప‌రిమిత‌మైంది.

Also Read : క‌స్సుమ‌న్న మియాకు సాల్ట్ కౌంట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!