Virat Kohli : పాకిస్తాన్ పై విజ‌యం కోహ్లీ భావోద్వేగం

టీమిండియా విక్ట‌రీలో కీల‌క పాత్ర

Virat Kohli : ఆస్ట్రేలియా వేదిక‌గా సూప‌ర్ -12 లో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో నువ్వా నేనా అన్న రీతిలో చివ‌రి బంతి దాకా ఉత్కంఠ‌ను రేపింది. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై టెన్ష‌న్ నెల‌కొంది. చివ‌ర‌కు టీమిండియా అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఈ విక్ట‌రీలో కీల‌క పాత్ర పోషించాడు.

ఒక ర‌కంగా చెప్పాలంటే అన్నీ తానై ముందుండి న‌డిపించాడు. గెలుపు అనంత‌రం విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు. క‌ళ్ల‌ల్లో నీళ్లు వ‌చ్చాయి. విరోచిత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీని(Virat Kohli) సినీ సెల‌బ్రెటిల‌తో పాటు తాజా, మాజీ ఆట‌గాళ్లు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ అయితే ఏకంగా విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు.

అత‌డిని చూసి నేర్చుకోవాల‌ని సూచించాడు. అంత‌కు ముందు మ్యాచ్ సంద‌ర్భంగా జాతీయ గీతం సంద‌ర్భంగా భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ క‌న్నీటి ప‌ర్యంతం కావ‌డం, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇక పాకిస్తాన్ పై గెలుపొంద‌గానే విరాట్ కోహ్లీ మైదానం అంతా క‌లియ‌తీరాడు. మోకాళ్ల‌పై కూర్చుని అభివాదం చేశాడు.

ఆట‌గాళ్లంతా అత‌డిని చుట్టుముట్టారు. అత‌డి క‌ళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 53 బంతులు ఆడాడు. 82 ప‌రుగులు చేశాడు. ఒకానొక ద‌శ‌లో 64 ప‌రుగుల‌కే 4 కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న భార‌త జ‌ట్టును విజ‌య‌పు ఒడ్డుకు చేర్చాడు కోహ్లీ. మ‌రో వైపు కోహ్లీకి హార్దిక్ పాండ్యా తోడుగా నిలిచాడు. చిర‌స్మ‌ర‌ణీయ‌మైన గెలుపు అందించారు.

Also Read : ర‌న్ మెషీన్ కు ది వాల్ అభినంద‌న

Leave A Reply

Your Email Id will not be published!