Virat Kohli : రికార్డుల‌పై క‌న్నేసిన ర‌న్ మెషీన్

చ‌రిత్ర సృష్టించేందుకు రెడీ

Virat Kohli : ప్ర‌పంచ క్రికెట్ లో ర‌న్ మెషీన్ గా పేరొందిన విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. వ‌ర‌ల్డ్ వైడ్ గా మోస్ట్ పాపుల‌ర్ క్రికెట‌ర్ల‌లో అత‌డు కూడా ఒక‌డు. ఒక్క‌సారి మైదానంలోకి వ‌చ్చాడంటే చాలు ఫుల్ జోష్ నింప‌డంతో పాటు ఎనర్జీ కూడా కిక్కు ఎక్కించేలా ఆడ‌డంలో త‌న‌కు తానే సాటి. మ‌నోడికి మొద‌టి నుంచి ఓట‌మి అంటే ప‌డ‌దు. అంత‌కంటే అస‌హ్యం కూడా. ఎక్క‌డా అప‌జ‌యాన్ని ఒప్పుకోడు. ఎలాగైనా స‌రే గెలవ‌డ‌మే త‌న‌కు కావాల్సింది అంటాడు.

ఇక ప్ర‌పంచ క్రికెట్ లో రారాజుగా ఇప్ప‌టికీ త‌న పేరును లిఖించుకున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ రికార్డును అధిగ‌మించేందుకు ద‌రిదాపుల్లో ఉన్న ఏకైక క్రికెట్ ఒక్క విరాట్ కోహ్లీ(Virat Kohli) మాత్ర‌మే. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా విరాట్ కోహ్లీ ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డ్డాడు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

ఎన్నో విమ‌ర్శ‌లు కూడా వెళ్లువెత్తాయి. ఆపై జ‌ట్టులో ఉంటాడో ఉండడో అన్న అనుమానం త‌లెత్తింది. కానీ దెబ్బ‌తిన్న పులిలా మ‌రోసారి త‌న ప‌వ‌ర్ ఏమిటో చూపించాడు. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌నతో ఆక‌ట్టుకున్నాడు. అంతే కాదు ఆఫ్గ‌నిస్తాన్ తో క‌ళ్లు చెదిరే షాట్ల‌తో సెంచ‌రీ చేశాడు.

అత్య‌ధిక ర‌న్స్ చేసిన ఆట‌గాడిగా భార‌త్ త‌ర‌పున నిలిచాడు. అనంత‌రం రెస్ట్ తీసుకున్న కోహ్లీ తిరిగి బంగ్లాదేశ్ టూర్ లో ఆడుతున్నాడు. మొద‌టి వ‌న్డేలో విఫ‌ల‌మైనా రెండో వ‌న్డేకు సిద్ద‌మ‌య్యాడు. ఈ మ్యాచ్ లో గ‌నుక 21 ర‌న్స్ చేస్తే బంగ్లాదేశ్ పై 1,000 ర‌న్స్ చేసిన రెండో బ్యాట‌ర్ గా నిలుస్తాడు. సంగ‌క్క‌ర 1,045 ర‌న్స్ తో టాప్ లో ఉన్నాడు. ప్ర‌స్తుతం కోహ్లీ పేరు మీద 71 సెంచ‌రీలు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గ‌ను శ‌త‌కం సాధిస్తే రికీ పాంటింగ్ ను దాటేస్తాడు.

క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెట‌ర్లు సైతం విరాట్ కోహ్లీ మ‌రోసారి స‌త్తా చాటాల‌ని కోరుకుంటున్నారు.

Also Read : ఇక‌నైనా రాణిస్తారా లేక చేతులెత్తేస్తారా

Leave A Reply

Your Email Id will not be published!