Virat Kohli : సఫారీ టూర్ లో ఘోరంగా విఫలమైన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలను మరోసారి వెనకేసుకు వచ్చాడు భారత టెస్టు జట్టు స్కిప్పర్ విరాట్ కోహ్లీ(Virat Kohli). మూడు టెస్టుల సీరీస్ లో భారత్ మూడో టెస్టు కోల్పోయింది.
ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది సౌతాఫ్రికా. ఫస్ట్ టెస్టులో టీమిండియా గెలిస్తే రెండు, మూడో టెస్టుల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది సఫారీ టీమ్. మూడో టెస్టు ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పుజారా, రహానేలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కోహ్లీ. పుజారా, రహానేలు ఇద్దరూ భారత విజయాలలో కీలక పాత్ర పోషించారంటూ కితాబు ఇచ్చాడు.
మ్యాచ్ లు అన్నాక గెలుపు ఓటములు సహజమేనని పేర్కొన్నాడు. అయితే వారిద్దరి భవిష్యత్తును తాను ఎలా నిర్ణయిస్తానని తిరుగు ప్రశ్నించాడు. సీనియర్లుగా వారి అనుభవం జట్టుకు చాలా అవసరమని స్పష్టం చేశాడు మరోసారి విరాట్ కోహ్లీ(Virat Kohli).
సెలెక్టర్లు వారిద్దరినీ జట్టులో ఎంపిక చేస్తే మాత్రం తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని కుండ బద్దలు కొట్టాడు. వీరిద్దరూ జట్టుకు భారంగా తయారయ్యారంటూ ఈ మధ్య విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక మూడు టెస్టుల సీరీస్ లో రహానే 136 పరుగులు చేస్తే పుజారా 124 రన్స్ చేశాడు. ఇదిలా ఉండగా భారత జట్టు ఆట తీరుపై తాజా, మాజీ ఆటగాళ్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా వచ్చినా భారత జట్టు ఆట తీరులో ఎలాంటి మార్పు రాక పోవడంపై బీసీసీఐ పునరాలోచనలో పడింది.
Also Read : దంచి కొట్టిన రిషబ్ పంత్