Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘనత
ఆర్సీబీ తరపున 7 వేల పరుగులు
Virat Kohli : విరాట్ కోహ్లీ పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్న హీరో. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కసారి కమిట్ అయ్యాడంటే అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు.
కానీ గత ఐపీఎల్ సీజన్ నుంచి నేటి దాకా పేలవమైన ఆట తీరుతో నానా తంటాలు పడ్డాడు. కానీ కీలకమైన లీగ్ మ్యాచ్ లో జోరుమీదున్న గుజరాత్ టైటాన్స్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
కీలకమైన 73 పరుగులు చేశాడు. 54 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఫీట్ సాధించాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఏకంగా 7 వేల పరుగులు చేశాడు.
గుజరాత్ తో ఆడుతున్న సమయంలో 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు 235 ఇన్నింగ్స్ లు ఆడాడు.
ఇక ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో ఒక జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ(Virat Kohli). భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ) మొదటి సారిగా ఐపీఎల్ ను 2008లో స్టార్ట్ చేసింది.
ఇప్పటి వరకు 14 సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 2022లో ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 15వ సీజన్. ఇక ప్రస్తుత సీజన్ లో విరాట్ కోహ్లీ 236 పరుగులు మాత్రమే చేశాడు. మూడు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
మొత్తంగా విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫామ్ లోకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : గుజరాత్ జైత్రయాత్రకు ఆర్సీబీ బ్రేక్