Winston Benjamin : విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ కాదు – బెంజిమన్
విండీస్ మాజీ పేసర్ సంచలన కామెంట్స్
Winston Benjamin : వెస్టిండీస్ మాజీ పేసర్ విన్ స్టన్ బెంజిమన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ డేంజరస్ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ(Virat Kohli) పేరొందాడు. ఏడేళ్లకు పైగా భారత జట్టుకు సారథ్యం వహించాడు. మూడు ఫార్మాట్ లలో టీమిండియాకు ఘనమైన విజయాలు సాధించి పెట్టాడు.
ఈ సందర్భంగా కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బెంజిమన్. అంతా విరాట్ కోహ్లీ గురించి గొప్ప కెప్టెన్ అంటున్నారని కానీ తన దృష్టిలో అలాంటి నాయకుడు కానే కాదన్నాడు. విండీస్ మాజీ పేసర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ను తన క్రికెట్ అకాడమీలో యువకుల కోసం కొన్ని క్రికెట్ పరికరాలను అందించమని కోరాడని తెలిపాడు.
ఇదే సమయంలో విన్ స్టన్ బెంజిమన్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అజారుద్దీన్ తనకు కొన్ని పరికరాలతో సహాయం చేశాడని చెప్పాడు. నేను పేర్కొన్న కామెంట్స్ కొందరికి ఇష్టం కలిగించక పోవచ్చు.
కానీ ఇది వాస్తవం ఒక రకంగా అజహరుద్దీన్, సచిన్ ముందుకు రావడం తనను విస్తు పోయేలా చేసిందన్నాడు విన్ స్టన్ బెంజిమన్(Winston Benjamin). చిన్న అకాడెమీకి సాయం అందించడం గొప్ప విషయంగా పేర్కొన్నాడు. సహాయం చేయాలని అనుకోవడం రియల్లీ గ్రేట్. ఒక రకంగా ఇలాంటి సాయం ప్రతి చోటా అందాలని కోరాడు.
ఇప్పటి దాకా సంపాదించిన పరికరాలు ఉత్తమంగా ఉపయోగించుకునేలా చేస్తామన్నాడు. విండీస్ తరపున 21 టెస్టులు 85 వన్డేలు ఆడాడు బెంజిమన్.
Also Read : ఐసీసీ అంపైర్ల ప్యానల్ లో నితిన్ మీనన్