Kohli Rahul Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ ఆట అద్భుతం

కితాబు ఇచ్చిన విరాట్ కోహ్లీ..కేఎల్ రాహుల్

కోల్ క‌తా వేదిక‌గా ఈడెన్ గార్డెన్స్ లో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ క్రికెట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 47 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. ఫోర్లు , సిక్స‌ర్లు క‌లిపి 90 ప‌రుగులు చేశాడు. మిగ‌తా సింగల్స్ రూపంగా వ‌చ్చాయి. అంతే కాదు ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత వేగ‌వంత‌మైన హాఫ్ సెంచ‌రీ చేశాడు. కేవ‌లం 13 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని ఈ అరుదైన ఫీట్ సాధించాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ లో కేవ‌లం 14 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేసిన కేఎల్ రాహుల్ , పాట్ క‌మిన్స్ పేరు మీద ఉండేది. ఆ రికార్డును బ్రేక్ చేశాడు య‌శ‌స్వి జైస్వాల్. అరుదైన ఘ‌న‌త‌ను సాధించిన యంగ్ క్రికెట‌ర్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురుస్తున్నాయి. అత‌డిని వెంట‌నే భార‌త క్రికెట్ జ‌ట్టులోకి తీసుకోవాల‌ని స్టార్ బౌల‌ర్ బ్రెట్ లీ , మైఖేల్ వాన్ సూచించారు.

జైశ్వాల్ ఆడిన ఆట తీరుకు ఫిదా అయ్యారు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , ఆర్సీబీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విరాట్ కోహ్లీ. ఇక త‌న పేరు మీద ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ రికార్డును బ్రేక్ చేసినందుకు అభినంద‌న‌లు తెలిపారు కేఎల్ రాహుల్. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడ‌ని , ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగ‌డం శుభ సూచ‌క‌మ‌ని పేర్కొన్నారు. మొత్తంగా ఐపీఎల్ లో య‌శ‌స్వి జైస్వాల్ హాట్ టాపిక్ గా మారడం విశేషం.

Leave A Reply

Your Email Id will not be published!