Virat Kohli : అరుదైన రికార్డ్ కు చేరువలో కోహ్లీ

28 ప‌రుగులు చేస్తే చాలు

Virat Kohli : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , స్టార్ హిట్ట‌ర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరులో ఉన్నారు సీఎం విరాట్ కోహ్లీ. గ‌త కొంత కాలంగా ఫామ్ లేమితో కొట్టుమిట్టాడిన కోహ్లీ ఈ ఏడాది దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన టి20 ఆసియా క‌ప్ లో ఆఫ్గ‌నిస్తాన్ పై సెంచ‌రీతో మ‌ళ్లీ పామ్ లోకి వ‌చ్చాడు.

అనంత‌రం ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ తో 82 ర‌న్స్ చేస్తే నెద‌ర్లాండ్స్ తో 68 ప‌రుగులు చేసి స‌త్తా చాటాడు. అరుదైన రికార్డుకు చేరువ‌లో ఉన్నారు కోహ్లీ. ఆదివారం పెర్త్ లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో కేవ‌లం 28 ప‌రుగుల అడుగు దూరంలో ఉన్నాడు.

కోహ్లీ కంటే ముందు మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే 31 టి20 మ్యాచ్ ల్లో 1016 ప‌రుగులు చేశారు. విరాట్ కోహ్లీ(Virat Kohli)  ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ లో విరాట్ కోహ్లీ 23 మ్యాచ్ ల్లో 21 ఇన్నింగ్స్ ల్లో 989 ప‌రుగులు చేశాడు. గ‌త రికార్డుల‌న్నంటినీ బ‌ద్ద‌లు కొట్టాలంటే కోహ్లీకి ఇంకా 28 ర‌న్స్ చేయాల్సి ఉంది.

ఈ ఏడాదిలో త‌న ఫామ్ ను మెల్ల‌గా ప్రారంభించిన‌ప్ప‌టికీ ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మునుప‌టి ద్వైపాక్షిక సీరీస్ మ్యాచ్ ల‌లోల త‌న గాడిని తిరిగి పొందాడు. ఇక చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఓట‌మి అంచుల్లో ఉన్న భార‌త జ‌ట్టును గెలుపు అంచుల్లోకి తీసుకు వెళ్లాడు.

హార్దిక్ పాండ్యాతో క‌లిసి కీల‌క పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఇంకా ప‌లు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది భార‌త జ‌ట్టు. దాంతో కోహ్లీ జ‌య‌వ‌ర్ద‌నే రికార్డును అధిగ‌మించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Also Read : హ‌మ్మ‌య్య పాకిస్తాన్ గెలిచింది

Leave A Reply

Your Email Id will not be published!