Virat Kohli : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్ చేశాడు. కెప్టెన్సీ లేదన్న బాధ తనకు ఏమీ లేదన్నాడు. గత ఏడేళ్లలో తాను ఏం చేశాన్నది మళ్లీ చెప్పు కోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
ఆట అన్నాక ఇవ మామూలేనని పేర్కొన్నాడు. తాను మొదటి నుంచీ ఓటమి ఒప్పుకోనని విజయమో వీర స్వర్గమో అన్న దిశగానే తాను ఆలోచిస్తానని చెప్పాడు.
విజయాలు, అపజయాలు ఆట అన్నాక మమూలేనని స్పష్టం చేశాడు. తాను గెలిచినప్పుడు ఆనందపడ లేదని ఓడి పోయినప్పుడు కుంగి పోలేదని అన్నాడు విరాట్ కోహ్లీ(Virat Kohli).
ఈ దేశం కోసం ఆడానని, వంద శాతం పర్ ఫార్మెన్స్ ఉండేలా ప్రయత్నం చేశానని ఇక నుంచీ కూడా అదే కొనసాగిస్తానని చెప్పాడు. అధికారికంగా తాను సారథి కాక పోయి ఉండవచ్చు.
కానీ ఆటగాడిగా తన స్థానం ఏమిటో స్థాయి ఏమిటో తెలుసన్నాడు. తన కెరీర్ సక్సెస్ రేట్ ఎంతుందో కూడా తాను పట్టించుకోనని ఇక వేరే వాళ్లు తన గురించి ఏం మాట్లాడుతున్నారనే దానిపై పెద్దగా పట్టించు కోనన్నాడు.
తన ఫోకస్ అంతా మైదానంపై ఉంటుందని అక్కడ ముగిశాక ఇంటిపై ఉంటుందన్నాడు విరాట్ కోహ్లీ(Virat Kohli). నా అటిట్యూడ్ కొందరికి ఇబ్బందిగా ఉండవచ్చని కానీ దూకుడుగా ఉంటేనే అవతలి వారిని మనం ఎదుర్కోగలమన్న సంకేతం ఇచ్చినట్లవుతుందన్నాడు.
ఆట పరంగా తాను ఎంతో నేర్చుకున్నానని, ఈ ఆటే తనను ఇంత వాడిని చేసిందన్నాడు. అందుకనే క్రికెట్ పైనే దృష్టి ఉంటుందని మరోసారి వెల్లడించాడు కోహ్లీ.
Also Read : కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే కష్టం