Virat Kohli : సెంచరీతో కదం తొక్కిన కోహ్లీ
44వ సెంచరీ చేసిన రన్ మెషీన్
Virat Kohli : బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. ఏకంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 409 పరుగుల భారీ స్కోర్ చేసింది. వన్డేల్లో ఇషాన్ కిషన్ 126 బంతులు ఆడి డబుల్ సెంచరీ చేసి రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు క్రిస్ గేల్ , సచిన్ రమేష్ టెండూల్కర్ , వీరేంద్ సెహ్వాగ్, రోహిత్ శర్మ చేశారు.
ఇక ఇసాన్ తో పాటు మాజీ భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం రెచ్చి పోయాడు. మొదటి, రెండో వన్డేలలో సరిగా రాణించలేక పోయిన కోహ్లీ ఈ మ్యాచ్ లో సత్తా చాటాడు. కేవలం 85 బంతులు మాత్రమే ఎదుర్కొని 113 రన్స్ చేసి నిష్క్రమించాడు. రెండో వికెట్ కు విరాట్ కోహ్లీ(Virat Kohli) , ఇషాన్ కిషన్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ ఇద్దరూ కలిసి ఏకంగా 290 రన్స్ జోడించారు. ఇది కూడా ఓ రికార్డ్ కావడం విశేషం. తాజాగా ఈ ఇన్నింగ్్ తో అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ సెంచరీల సంఖ్య 72కు చేరుకుంది. రెండో స్థానంలో ఉన్న రికీ పాంటింగ్ ను దాటేశాడు . ప్రస్తుతం అత్యధిక సెంచరీల సంఖ్య ఉన్న బ్యాటర్ గా రెండో స్థానంలో నిలిచాడు.
తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మకు గాయం కావడంతో కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తున్నాడు. రికార్డు స్కోర్ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : చెలరేగిన జాక్ లీచ్..జో రూట్