Virat Kohli : ర‌న్ మెషీన్ రికార్డ్ సెంచ‌రీ

గుజ‌రాత్ టైటాన్స్ కు చుక్క‌లు

Virat Kohli : కీల‌క‌మైన మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మాజీ కెప్టెన్ , ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) దుమ్ము రేపాడు. మ‌రోసారి స‌త్తా చాటాడు. ఈ ఐపీఎల్ 16వ సీజ‌న్ లో ఇది రెండో సెంచ‌రీ కావ‌డం విశేషం. ముందుగా బ్యాటింగ్ కు దిగింది ఆర్సీబీ. ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెలుపొందాల్సిన మ్యాచ్ లో దుమ్ము రేపాడు కింగ్ కోహ్లీ.

61 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 13 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో రెచ్చి పోయాడు. గుజ‌రాత్ టైటాన్స్ కు చుక్క‌లు చూపించాడు. 101 ప‌రుగులు చేశాడు. అంతే కాదు ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో అత్య‌ధికంగా ఏడు సార్లు సెంచ‌రీ చేసిన క్రికెట‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు. అంతకు ముందు విండీస్ స్టార్ క్రికెట‌ర్ క్రెస్ గేల్ పేరు మీద ఉన్న రికార్డును చెరిపేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 5 వికెట్లు కోల్పోయి 197 ర‌న్స్ భారీ స్కోర్ చేసింది.

మిగ‌తా బ్యాట‌ర్లంతా పెవిలియ‌న్ దారి ప‌డుతుంటే తాను ఒక్క‌డు మాత్రం శిఖ‌రంలా నిల‌బ‌డ్డాడు. ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ పై ఆడిన ఆట తీరును గుర్తుకు తెచ్చాడు విరాట్ కోహ్లీ. ర‌న్ మెషీన్ కు తోడుగా మైఖేల్ బ్రేస్ వెల్ 26 ర‌న్స్ చేస్తే అనుజ్ రావ‌త్ 21 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఫాఫ్ డుప్లెసిస్ 28 ర‌న్స్ చేశాడు . కోహ్లీతో క‌లిసి తొలి వికెట్ కు 67 ర‌న్స్ జోడించారు. మ్యాక్స్ వెల్ 11 ర‌న్స్ చేస్తే లోమ్ రోర్ ఒక ప‌రుగు చేసి నిరాశ ప‌రిచాడు. దినేష్ కార్తీక్ గోల్డెన్ డ‌క్ గా వెనుదిరిగాడు.

Also Read : Kavya Maran

Leave A Reply

Your Email Id will not be published!