Virat Kohli : క్రికెట్ ముఖ్యం దేశం కోసం దేనికైనా సిద్దం
ఆసియా..వరల్డ్ కప్ అందించాలన్నదే కల
Virat Kohli : ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతూ ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్ చేశాడు.
ఒకానొక దశలో అతడు జట్టులో ఉంటాడా ఉండడా అన్న అనుమానం తలెత్తిన తరుణంలో ఆదివారం కోహ్లీ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. నాకు క్రికెట్ అంటే ప్రాణం.
ఆటపైనే ఎక్కువగా ఫోకస్ పెడతా. ఒక్కోసారి అంచనాలకు మించి ఆడలేక పోవచ్చు. ప్రతిసారి 100 శాతం ప్రదర్శించాలని అనుకుంటా. ఫ్యాన్స్ ఆశించిన మేరకు రాణించలేక పోవచ్చు.
ఈ తరుణంలో విమర్శలు రావడం అన్నది సహజం. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. నా ప్రధాన లక్ష్యం ఒక్కటే. ఆడుతూ ఉండడం. ఒకరోజున నేను ఆడలేక పోయినట్లయితే ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు.
నా అంతకు నేను తప్పుకునేందుకు సిద్దంగా ఉంటానని కుండ బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) . వచ్చే నెలలో యూఏఈలో ఆసియా కప్ , ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ జరుగుతోంది.
ఈ రెండింటిని భారత్ కు అందించాలన్నది తన కల అని స్పష్టం చేశాడు విరాట్. 2019 నుంచి ఆశించిన మేర ఇన్నింగ్స్ లు ఆడలేక పోయాడు.
గతంలో జరిగిన ఆసియా కప్ అత్యధిక పరుగులు సాధించిన రికార్డు కోహ్లీ మీదే ఉంది. 33 ఏళ్ల వయస్సున్న విరాట్ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.
మరో వైపు మాజీ ఆటగాళ్లు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న కోహ్లీని ఎందుకు ఆడిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Also Read : అరబ్ వేదికపై క్రికెట్ పండగ