Virat kohli : ర‌న్ మెషీన్ సెన్సేష‌న్ సెంచ‌రీ

రెచ్చి పోయిన విరాట్ కోహ్లీ

Virat kohli : హైద‌రాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఆరంభంలో త‌డ‌బ‌డినా ఆ త‌ర్వాత పుంజుకుంది. ఈ విజ‌యంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. టోర్నీ లో ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ మిగిలింది.

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే ముందుగా బ్యాటింగ్ చేసింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 185 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. హెన్రిచ్ క్లాసెన్ తుక్కు రేపాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 104 ప‌రుగులు చేసి ఆఖ‌రున ఔట్ అయ్యాడు.

అనంత‌రం 186 ర‌న్స్ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ తో మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు. 71 ర‌న్స్ చేశాడు. ఇక ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ శ‌త‌క్కొట్టాడు. రెచ్చి పోయాడు..హైద‌రాబాద్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

స‌రిగ్గా 100 ప‌రుగులు చేశాడు. సెంచ‌రీ చేసేందుకు కోహ్లీకి స‌రిగ్గా నాలుగు ఏళ్లు ప‌ట్టింది. విరాట్ సెంచ‌రీలో 12 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. మొత్తం 63 బంతులు ఎదుర్కొన్నాడు. ఇదిలా ఉండ‌గా ఎస్ ఆర్ హెచ్ కు ఇది ఆరో ఓట‌మి. టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తో క‌లిసి కోహ్లీ భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఈ సీజ‌న్ లో అద్భుత‌మైన ఫామ్ తో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు విరాట్ కోహ్లీ.

Also Read : SRH vs RCB IPL 2023

 

Leave A Reply

Your Email Id will not be published!