Virat Kohli RCB : కోహ్లీ మెరిసినా త‌ప్ప‌ని ఓట‌మి

21 ప‌రుగుల తేడాతో కోల్ క‌తా గెలుపు

Virat Kohli RCB : ఐపీఎల్ లీగ్ లో కీల‌క‌మైన మ్యాచ్ లో బోల్తా ప‌డింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB). వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీదున్న ఆర్సీబీకి కోల్ కతా నైట్ రైడ‌ర్స్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. 21 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసింది కోల్ క‌తా. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 200 ర‌న్స్ చేసింది. ఓపెన‌ర్ జేస‌న్ రాయ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఇక నితీష్ రాణా కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో దుమ్ము రేపాడు. ఆఖ‌రులో వ‌చ్చిన యూపీ యంగ్ స్టార్ రింకూ సింగ్ క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు.

అనంత‌రం 201 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బెంగ‌ళూరు 179 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఆరంభంలో కోల్ క‌తా బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు ఆర్సీబీ బ్యాట‌ర్లు. కానీ ఆ త‌ర్వాత కోల్ క‌తా స్పిన్ ద్వ‌యానికి విల విల లాడారు. విరాట్ కోహ్లీ(Virat Kohli RCB), దినేష్ కార్తీక్ త‌ప్పించి మిగ‌తా వారెవ్వ‌రూ బౌలింగ్ ధాటికి నిల‌బ‌డ‌లేక పోయారు. ఇక క్రీజులో ఉన్నంత సేపు విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడాడు.

ర‌న్ మెషీన్ 34 బంతులు ఎదుర్కొని 54 ర‌న్స్ చేశాడు. ఫాఫ్ డుప్లెసిస్ 17 ర‌న్స్ చేస్తే గ్లెన్ మాక్స్ వెల్ 5 ప‌రుగుల‌కే వెనుదిరిగాడు. ఇక దినేష్ కార్తీక్ 22 ర‌న్స్ చేసినా ఫ‌లితం లేక పోయింది. చివ‌రలో ప‌రుగులు చేయ‌లేక చేతులెత్తేసింది బెంగ‌ళూరు.

Also Read : కోల్‌కతా భ‌ళా బెంగ‌ళూరు బోల్తా

Leave A Reply

Your Email Id will not be published!