భారత స్టార్ క్రికెటర్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఐపీఎల్ 16వ సీజన్ లో వరుసగా కోహ్లీకి ఇది రెండోసారి జరిమానాకు గురి కావడం. కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు ఇప్పటికే రూ. 12 లక్షల ఫైన్ విధించింది ఐపీఎల్ కమిటీ. మొదటిసారికి క్షమించి రూ. 12 లక్షలతో సరిపెట్టిన పర్యవేక్షణ కమిటీ రెండోసారి రూల్స్ ను అతిక్రమించడంతో ఏకంగా రూ. 24 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటిచింది.
ఈ మేరకు ఐపీఎల్ ను నిర్వహిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారికంగా ధ్రువీకరించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఇది వరుసగా రెండో నేరం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాయం కారణంగా తప్పుకున్నాడు.
దీంతో మేనేజ్ మెంట్ విరాట్ కోహ్లీని స్టాండ్ ఇన్ స్కిప్పర్ గా ఎంపిక చేసింది. స్లో ఓవర్ రేట్ తో పాటు రన్ మెషీన్ ప్రవర్తన మైదానంలో సరిగా లేదని కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా ఇంకోసారి ఇలాగే ప్రవర్తిస్తే ఒక మ్యాచ్ నుంచి నిషేధానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఐపీఎల్ సీజన్ లో సంజూ శాంసన్ , హార్దిక్ పాండ్య, ఫాఫ్ డుప్లెసిస్ లకు ఇప్పటికే జరిమానా విధించారు.
