Virat Kohli Video leaked : హోటల్ నిర్వాకం కోహ్లీ ఆగ్రహం
నాకంటూ ప్రైవసీ లేదానన్న క్రికెటర్
Virat Kohli Video leaked : ఆస్ట్రేలియా వేదికగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన టి20 వరల్డ్ కప్ కొనసాగుతోంది. ఇప్పటికే భోజనం విషయంలో భారత జట్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే సమయంలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉంటున్న హోటల్ రూమ్ కు సంబంధించిన వీడియో లీక్(Virat Kohli Video leaked) అయ్యింది.
అది నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిని సీరియస్ గా తీసుకున్నారు రన్ మెషీన్ . టీమ్ మేనేజ్ మెంట్ కు, బీసీసీఐకి సమాచారం చేర వేశారు. దీంతో ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో హోటల్ యాజమాన్యం రంగంలోకి దిగింది. కోహ్లీకి జరిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నట్లు తెలిపింది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ పెర్త్ లోని క్రౌన్ హోటల్ లో ఉన్నారు. కోహ్లీ రూంకు సంబంధించిన వస్తువులు ఇందులో ఉన్నాయి. వాటిని వీడియో రూపంలో ఎవరు బయటకు చేర వేశారనే దానిపై చర్చ కొనసాగుతోంది.
క్రౌన్ పెర్త్ హోటల్ యాజమాన్యం టీమ్ కెప్టెన్ తో , కోహ్లీతో చర్చలు జరిపింది. జరిగిన అసౌకర్యానికి సంబంధించి తాము చింతిస్తున్నామని, తమను క్షమించమని వేడుకుంది. ఇదిలా ఉండగా విరాట్ కోహ్లీతో పాటు భార్య అనుష్క శర్మ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తనను తాము సహించ బోమంటూ స్పష్టం చేసింది హొటల్ మేనేజ్ మెంట్.
Also Read : అరుదైన రికార్డ్ కు చేరువలో కోహ్లీ