Sourav Ganguly : విరాట్ కోహ్లీ నిర్ణ‌యం వ్య‌క్తిగ‌తం – దాదా

జ‌ట్టు బ‌లోపేతానికి కృషి ప్ర‌శంస‌నీయం

Sourav Ganguly  : భార‌త క్రికెట్ జ‌ట్టు టెస్టు సార‌థ్య బాధ్య‌త‌ల‌కు గుడ్ బై చెప్పిన దిగ్గ‌జ ఆట‌గాడు విరాట్ కోహ్లీ నిర్ణ‌యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు భార‌తీయ క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ (Sourav Ganguly )అలియాస్ దాదా.

టీమిండియాను అన్ని ఫార్మాట్ ల‌లో టాప్ లో నిలిపేందుకు చాలా క‌ష్ట ప‌డ్డాడంటూ కితాబు ఇచ్చాడు. అయితే కెప్టెన్సీ నుంచి త‌ప్పు కోవ‌డం అత‌డి వ్య‌క్తిగ‌త‌మ‌ని తాము జోక్యం చేసుకోబోమంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టాడు.

విచిత్రం ఏమిటంటే దాదా రానంత వ‌ర‌కు బీసీసీఐలో ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా ఉండేది. ఎప్పుడైతే బీసీసీఐ చీఫ్ గా గంగూలీ(Sourav Ganguly )వ‌చ్చాడో ఆనాటి నుంచీ పెను మార్పులు చోటు చేసుకున్నాయి.

బోర్డులో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు. కోహ్లీ డెసిష‌న్ ను బీసీసీఐ స్వాగ‌తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశాడు. ఏదో ఒక‌రోజు ఎంత‌టి స్థాయిలో ఉన్నా ఆట నుంచి నిష్క్ర‌మించాల్సిందేన‌ని పేర్కొన్నాడు.

ఏ ప్లేయ‌ర్ కైనా ఏ ఆట‌లోనైనా ఒక్కోసారి ఫామ్ అన్న‌ది కీల‌కంగా మారుతుంద‌ని జీవిత‌కాలం ఒకేలా ఉండ‌ద‌ని అన్నాడు గంగూలీ. విచిత్రం ఏమిటంటే దాదా రావ‌డంతో అప్ప‌టి దాకా వ‌న్ మ్యాన్ షో న‌డిపించిన కోహ్లీ, ర‌విశాస్త్రి కాంబినేష‌న్ కు చెక్ ప‌డిన‌ట్ల‌యింది.

కోహ్లీ ఒంటెద్దు పోక‌డ కూడా అత‌డు సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకునేందుకు మ‌రో కార‌ణమ‌ని మాజీ ఆట‌గాళ్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా గంగూలీ అంటే నిప్పు.

తాను ఒక ర‌కంగా మోనార్క్. ఎక్క‌డా అవినీతి మ‌ర‌క అంట‌ని అరుదైన క్రికెట‌ర్. త‌ను కూడా భార‌త సార‌థి గా ఉంటూ చాపెల్ తో ప‌డ‌క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఏది ఏమైనా కోహ్లీ రాజీనామా ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది.

Also Read : ఐసీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ వెన‌క్కి

Leave A Reply

Your Email Id will not be published!