Virender Sehwag : రాజస్థాన్ ఓటమికి కెప్టెన్..కోచ్ కారణం
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్
Virender Sehwag : అస్సాంలోని గౌహతి వేదికగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో కేవలం 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారీ ధరకు కొనుగోలు చేసిన దేవదత్ పడిక్కల్ ఆశించిన మేర రాణించ లేదు. అతడిని ముందే పంపించడం వల్ల కొంప మునిగిందంటూ పేర్కొన్నాడు. అంత భారీ టార్గెట్ ఏమీ కాదన్నాడు.
ప్రస్తుతం కొనసాగుతున్న టి20 ఫార్మాట్ లో ఈ మాత్రం స్కోర్ పెద్దది కాదన్నాడు. పడిక్కల్ కంటే ముందే విండీస్ స్టార్ క్రికెటర్ షిమ్రోన్ హిట్మెయర్ ను పంపించి ఉంటే కథ వేరేగా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఓటమికి కెప్టెన్ సంజూ శాంసన్ , కోచ్ కుమార సంగక్కర కారణమని ఆరోపించాడు.
3 లేదా 4వ స్థానంలో షిమ్రోన్ ను పంపించి ఉంటే సులభంగా రాజస్థాన్ గెలిచి ఉండేదన్నాడు. బట్లర్ కు గాయం కావడంతో ముందుగా మేనేజ్ మెంట్ రవిచంద్రన్ అశ్విన్ ను పంపించింది.
ఆ తర్వాత వచ్చిన శాంసన్ పర్వాలేదని అనిపించినా జట్టును గెలిపించ లేక పోయాడు. ప్రధానంగా నాథన్ ఎల్లిస్ , సామ్ కరన్ , అర్ష్ దీప్ అద్భుతమైన బంతులతో రాజస్థాన్ బ్యాటర్లను బోల్తా కొట్టించారు. పడిక్కల్ కాకుండా షిమ్రోన్ , రియాన్ పరాగ్ మైదానంలో ఉంటే గెలిచి ఉండే వారని పేర్కొన్నాడు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag).
Also Read : సంజూ శాంసన్ అరుదైన రికార్డ్