Virender Sehwag : లక్నోకు కెప్టెన్ గంభీరా లేక మెంటరా
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్
Virender Sehwag : భారత మాజీ క్రికెటర్ , ప్రముఖ కామెంటేటర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐపీఎల్ 16వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు సంబంధించి కెప్టెన్ ఎవరు అని అనుమానం వ్యక్తం చేయడం కలకలం రేపింది. ప్రధానంగా గతంలో ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహించాడు మాజీ క్రికెటర్ , భారతీయ జనతా పార్టీ ఎంపీ , ప్రస్తుతం లోక్నోకు మెంటర్ గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్.
ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ పై 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే పనిలో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ మొదటి 10 ఓవర్లలో 100 రన్స్ పై ఎక్కువగా చేసింది. కానీ ఆ తర్వాత గుజరాత్ బౌలర్ల తాకిడికి తట్టుకోలేక పోయింది. మిగతా 10 ఓవర్లు ముగిసే సరికి 71 పరుగులకే పరిమితమైంది. 7 వికెట్లు కోల్పోయింది. ఆరంభం నుంచి అదర గొట్టింది. కానీ ఉన్నట్టుండి కుప్పు కూలడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.
అసలు లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ ఎవరు కృనాల్ పాండ్యానా లేక గౌతమ్ గంభీరా అని నిప్పులు చెరిగాడు. దీనికి పూర్తిగా మెంటర్ ను తప్పు పట్టాడు. 56 పరుగుల తేడాతో పరాజయం చెందడంపై కెప్టెన్, కోచ్ ల మధ్య చోటు చేసుకున్న అవగాహన లోపం వల్లనే ఇలా జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag).
Also Read : శాంసన్ పై కక్ష బీసీసీఐ వివక్ష