Virender Sehwag : రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ యజువేంద్ర చహల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. 2013లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం చోటు చేసుకున్న ఘటనపై స్పందించాడు.
ఆనాటు చోటు చేసుకున్న ఘటన గురించి తన తోటి సహచర ఆటగాళ్లు రవి చంద్రన్ అశ్విన్, కరణ్ నాయర్ తో కలిసి పంచుకున్నాడు. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ షేర్ చేసింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ హోటల్ లో గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా ముంబై ఇండియన్స్ కు చెందిన ఓ క్రికెటర్ తాగి వచ్చాడని, తనను రమ్మని పిలిస్తే వెళ్లానని తెలిపాడు.
ఇదే సమయంలో తనను తలకిందులుగా వేలాడ దీశాడని, బాల్కానీలో 15వ అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాడు. ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)తో పాటు యావత్ క్రికెట్ లోకాన్ని విస్తు పోయేలా చేసింది యజువేంద్ర చహల్ చేసిన వ్యాఖ్యలు.
మిగతా సహచరులు వచ్చి తనను బతికించారని అప్పటి ఘటన ఇంకా తనను వెంటాడుతూనే ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం నెట్టింట్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
దీనిపై దిగ్గజ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించాడు. నిన్ను తాగడమే కాక ఇబ్బంది పెట్టిన ఆ ముంబై ఇండియన్స్ కు చెందిన క్రికెటర్ ఎవరో చెప్పాలని కోరాడు.
దీనిపై విచారణ కూడా జరిపించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. మొత్తం మీద చహల్ విసిరిన ఈ యార్కర్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ ను ఇరకాటంలో పడేసింది.
ఆ క్రికెటర్ ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Also Read : భారత జట్టుకు ఫినిషర్ అవసరం