Veturi Sundararama Murty : తెలుగు సినీవాలిలో చిరస్మరణీయం ఆయన. తన కలం లోంచి జాలు వారిన ప్రతి పాటా ఆణిముత్యం. ఎన్ని పాటలు. గుండెల్ని హత్తుకునేలా. మళ్లీ మళ్లీ జ్ఞాపకం చేసుకునేలా రాశారు.
అటు ఆత్రేయను ఇటు శ్రీశ్రీని తన కలంలోకి ఒలికించిన మహానుభావుడు వేటూరి సుందర రామ్మూర్తి. ఇవాళ ఆయన జయంతి.
సినిమాలో కవికి తన పాటలతో అద్భుతమైన ప్రాచుర్యాన్ని తీసుకు వచ్చేలా చేసిన గేయ రచయితల్లో వేటూరి(Veturi Sundararama Murty) ఒకరైతే మరొకరు సిరివెన్నెల. ఇప్పుడు ఇద్దరూ లేరు.
వాళ్లు స్వర్గంలో పాటలు రాసుకుంటూ పాడుకుంటూ ఉంటారు.
కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లిలో 1936 జనవరి 29న పుట్టారు. 2010 మే 22న ఇక సెలవంటూ వెళ్లి పోయారు.
74 ఏళ్ల దాకా బతికారు. తొలి నాళ్లల్లో జర్నలిస్ట్ గా పని చేశారు. 16 ఏళ్ల పాటు ఉన్నారు.
దర్శకుడు కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగంలోకి ఎంటర్ అయ్యారు.
వేల పాటలు రాశారు. చివరి శ్వాస ఉన్నంత వరకు ఆయన పాటతోనే బతికారు. ఆ పాటలకు 8 నందులు దక్కాయి. ఎన్నో పురస్కారాలు లభించాయి.
సిని పాటకు తన పదాలతో ప్రాణం పోశారు. కీర్తనల్లోని పల్లవులు, పురాణ సాహిత్యం లోని పంక్తుల్ని జోడించి అందమైన పాటను రాశారు వేటూరి.
ఆయన కలం లోంచి జాలు వారిన ఎన్నో పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
శంకరా భరణం, సాగర సంగమం, సిరి సిరి మువ్వ, సప్త పది, సీతాకోక చిలుక, ముద్ద మందారం,
సితార, అన్వేషణ, స్వాతి ముత్యం ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది సినిమాలకు వేటూరి జీవం పోశారు.
కలంతో తనదైన ముద్ర కనబరిచారు. ఆయన రాసిన పాటల్లో చాలా పదాలు ఒ కొటేషన్స్ గా కూడా పనికి వస్తాయి.
అంతలా తనదైన ప్రతిభకు మెరుగులు అద్దారు వేటూరి(Veturi Sundararama Murty).
కవిత్వం నుంచి జానపద గీతాల దాకా దేనినీ వదిలి పెట్టలేదు ఆయన.
శ్రీశ్రీ తర్వాత జాతీయ స్థాయిలో రాలి పోయే పువ్వా నీకు రాగాలేందుకే అన్న పాటకు అవార్డు దక్కింది. పుస్తకాలు రాశారు.
కొన్ని పాటలకు అర్థాలతో కొమ్మ కొమ్మకో సన్నాయి అనే పుస్తకం విడుదల చేశారు.
రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా అని వాపోయాడు.
కంచికి పోతావా కృష్ణమా ఆ కంచి వార్తలేవి కృష్ణమ్మ మనసున ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ అని కన్నీళ్లు పెట్టించాడు వేటూరి.
తెలుగు సినీ తెర మీద ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఆయన రాసిన పాటలే ప్రాణమయ్యాయి.
ప్రాణపదమయ్యాయి. అందుకే గానం కోరుకునే గీతం వేటూరి గాయకుడు కోరుకునే కవి వేటూరి అన్నారు బాల మురళీకృష్ణ.
నా యాభైళ్ల కెరీర్ లో ఇద్దరే మహాకవులు ఒకరు కణ్ణదాసన్ ఇంకొకరు వేటూరి అన్నారు రాజన్ నాగేంద్ర.
వేటూరికి నేను కొనసాగింపు మాత్రమేనని వినమ్రంగా ఒప్పుకున్నారు సిరివెన్నెల.
Also Read : సినీ లోకం ‘శ్రుతి’ మందహాసం