Visakhapatnam Police: విశాఖలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

విశాఖలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

Visakhapatnam : విశాఖ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఈగిల్ టీం, విశాఖ (Visakhapatnam) నగర పోలీసులు సంయుక్తం చేపట్టిన ఆపరేషన్ లో సౌత్ ఆఫ్రికా కు చెందిన థామస్ డ్జిమోన్ తోపాటు విశాఖకు చెందిన అక్షయ్ ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 10 లక్షల రూపాయల విలువచేసే 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. థామస్ తో పాటు అక్షయ్ వెనుక ఉన్న డ్రగ్ డీలర్స్ ను పట్టుకోవడానికి విశాఖ నగర పోలీసు కమీషనర్ శంకభ్రతా బాగ్చీ ప్రత్యేక బృందాలను నియమించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Visakhapatnam Police

ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ రోడ్ లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం మేరకు ఈగిల్ టీం, విశాఖ నగర పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ లో సౌత్ ఆఫ్రికా కు చెందిన థామస్ డ్జిమోన్ ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి అక్షయ్ కు ఇస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే 25 గ్రాముల కొకెయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వారి వద్ద నుంచి ఒక కార్,3.6 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు , ఒక డైరీ స్వాధీనం చేసుకున్నారు. థామస్ డ్జిమోన్ ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి అక్షయ్ కు ఇస్తుండగా పట్టుకున్నాము. అక్షయ్ ని విచారించి గా ఢిల్లీకి చెందిన కొంతమంది పేర్లు చెప్పారు. విరి కోసం ఢిల్లీ కి పోలీస్ బృందాలను పంపించాము. డ్రగ్స్ రాకెట్ పై లోతైన విచారణ చేపడుతున్నాము అని విశాఖ సిపి శంఖ బ్రాత బాగ్చి మీడియాకు తెలిపారు.

Also Read : Minister Nara Lokesh: చిన్నారుల ఆవేదనకు చలించిన మంత్రి లోకేష్

Leave A Reply

Your Email Id will not be published!