Vishal Garg : ఎవరీ విశాల్ గార్గ్ అనుకుంటున్నారా. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారతీయుడైన సిఇఓ. ఆయన బెటర్. కామ్ కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్నారు.
గత ఏడాది క్రిస్మస్ కు కొన్ని వారాల ముందు జూమ్ కాల్ పై మాట్లాడినందుకు 900 మంది కార్మికులను ఉన్నపళంగా తొలగించారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా విశాల్ గార్గ్ (Vishal Garg ) హాట్ టాపిక్ గా మారారు.
తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. తాను చేసిన ఈ నిర్ణయం వల్ల ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తించారు. తాను తీసుకున్న నిర్ణయం పూర్తిగా తప్పని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు విశాల్ గార్గ్(Vishal Garg ).
కేవలం జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నారన్న ఆరోపణలపై భారీ ఎత్తున తొలగించారు. సర్వత్రా విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తడంతో తట్టుకోలేక పోయారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిఇఓగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు విశాల్ గార్గ్.
బెటర్. కామ్ ఆన్ లైన్ లో మార్టిగేజ్ కంపెనీ. గార్గ్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ చాలా మంది తమ పదవుల నుంచి తప్పుకున్నారు.
దీంతో భారీ ఎత్తున నష్టం వాటిల్లింది ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం కారణంగా. దీనికంతటికీ తానే కారణమని ఆయన భావించారు. తన తప్పు తెలుసుకున్నారు.
చివరకు పశ్చాతాప పడ్డారు. ఆపై క్షమాపణలు కోరారు. తిరిగి సిఇఓగా రావడం తనకు ఆనందం కలిగించే విషయమని పేర్కొన్నాడు విశాల్ గార్గ్.
కంపెనీ బోర్డు స్టాఫ్ మెమోలో ప్రకటించిన వారాల తర్వాత విశాల్ గార్గ్ తన స్థానానికి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : అంకురాలతో అరుదైన ఆవిష్కరణలు