Vivek Agnihotri : ఢిల్లీ కోర్టుకు వివేక్ అగ్నిహోత్రి క్షమాపణ
గౌతమ్ నవ్లాఖాకు న్యాయమూర్తి ఉపశమనం
Vivek Agnihotri : ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆయన ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. వివేక్ అగ్ని హోత్రి తన న్యాయవాది ద్వారా ట్వీట్ ను తొలగించినట్లు తెలిపారు. కోర్టుకు సహరిస్తున్న న్యాయవాది తాను అలా చేయలేదని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా ట్విట్టర్ దానిని తీసి వేసిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భీమా కోరేగావ్ హింసాకాండ కేసులో కార్యకర్త గౌతమ్ నవ్ లఖాకు ఉపశమనం కల్పించడంలో న్యాయమూర్తి పక్షపాతంతో వ్యవహరించారంటూ ఆరోపించారు. ఈ కామెంట్స్ ను అగ్నిహోత్రి(Vivek Agnihotri) 2018లో చేశారు.
ఇందుకు సంబంధించి చిత్ర నిర్మాత వివేక్ అగ్నిహోత్రి ఢిల్లీ హైకోర్టుకు బేషరతుగా సారీ చెబుతున్నట్లు స్పష్టం చేశారు. ఢిల్లీ హైకోర్టుకు ఈ విషయాన్ని తెలియ చేశారు స్వయంగా. కాగా ప్రస్తుతం ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎస్. మురళీధర్ పై చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న వివేక్ అగ్నిహోత్రి, రచయిత ఆనంద్ రంగనాథన్ , న్యూస్ పోర్టల్ స్వరాజ్యపై కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించింది.
ఇందుకు సంబంధించి చివరి విచారణలో మార్చి 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని వివేక్ అగ్ని హోత్రిని(Vivek Agnihotri) ఆదేశించింది కోర్టు. మరో వైపు తన లాయర్ ద్వారా దర్శక, నిర్మాత క్షమాపణ చెబుతూ అఫిడవిట్ సమర్పించారు. సందేహాస్పద ట్వీట్ ను తొలగించినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త ఎస్. గురుమూర్తి కూడా కామెంట్స్ చేశారు. ఆయన చివరకు క్షమాపణలు చెప్పడంతో కేసు నుండి తొలగించారు.
Also Read : బాలయ్య అన్‌స్టాపబుల్ అదుర్స్