Vivek Agnihotri : ప‌ఠాన్ పై కామెంట్స్ వివేక్ కు వార్నింగ్

స్వయంగా వెల్ల‌డించిన ద‌ర్శ‌కుడు

Vivek Agnihotri : ప్ర‌ముఖ న‌టుడు షారుఖ్ ఖాన్ , దీపికా ప‌దుకొనే క‌లిసి న‌టించిన ప‌ఠాన్ మూవీపై తీవ్ర రాద్దాంతం చెల‌రేగింది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, హిందూ నాయ‌కులు. హిందూ సంస్కృతిని కించ ప‌రిచేలా సినిమాలోని బేష‌ర‌మ్ సాంగ్ లో చిత్రీక‌రించారంటూ ఆరోపించారు.

దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే సినిమాను విడుద‌లను అడ్డుకుంటామంటూ మ‌రాఠా బీజేపీ ఎమ్మెల్యే రామ్ క‌ద‌మ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక మ‌ధ్య ప్ర‌దేశ్ బీజేపీ మంత్రి ఏకంగా పూర్తిగా నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ త‌రుణంలో సెన్సార్ బోర్డు సీరియ‌స్ గా స్పందించింది.

వెంట‌నే ప‌ఠాన్ మూవీ నిర్మాత‌ల‌ను ఆదేశించింది. సినిమాతో పాటు పాట‌ల‌ను మ‌రోసారి అభ్యంత‌రం లేకుండా చూడాల‌ని సూచించింది. ఇదే క్ర‌మంలో ప‌ఠాన్ మూవీని కావాల‌ని కాంట్రావ‌ర్సీ అయ్యేలా చేశారంటూ కాశ్మీర్ ఫైల్స్ ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి ఆరోపించారు. ఒక ర‌కంగా ఆయ‌న షారుఖ్ ఖాన్ ను ఎద్దేవా చేశారు.

దీనిపై తీవ్రంగా మండిప‌డ్డారు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ . ఇదే స‌మ‌యంలో డైరెక్ట‌ర్ వివేక్ అగ్నిహోత్రికి(Vivek Agnihotri) వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదే విష‌యాన్ని స్వ‌యంగా వివేక్ అగ్ని హోత్రి సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. ఈ దేశంలో ఇదో ర‌క‌మైన బెదిరింపులు రావ‌డం మామూలై పోయింద‌ని పేర్కొన్నాడు. ఉన్న వాస్త‌వాన్ని బ‌హిరంగంగా వ్య‌క్తం చేసే హ‌క్కు తన‌కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు అగ్నిహోత్రి.

డైరెక్ట‌ర్ కు వార్నింగ్ ఇవ్వ‌డాన్ని బీజేపీ శ్రేణులు త‌ప్పు ప‌డుతున్నాయి.

Also Read : ఫిబ్ర‌వ‌రి 17న రానున్న శాకుంత‌లం

Leave A Reply

Your Email Id will not be published!