Volkswagen CEO : వోక్స్‌వ్యాగన్ సిఇఓ తొలగింపు
ఊహించని షాక్ ఇచ్చిన కంపెనీ
Volkswagen CEO : ప్రపంచ వ్యాప్తంగా వాహనాల తయారీలో పేరొందిన వోక్స్ వ్యాగన్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన కార్య నిర్వహణ అధికారి (సిఇఓ) (Volkswagen CEO) గా హెర్బర్ట్ డైస్ పై అనూహ్యంగా వేటు వేసింది.
ఇది ఊహించని బిగ్ షాక్. విచిత్రం ఏమిటంటే సంస్థలో సిఇఓ పదవీ కాలం అక్టోబర్ 2025 దాకా ఉంది. అప్పటి వరకు ఆయన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది.
మెజారిటీ యజమానులైన వీడబ్ల్యూ హెర్బర్ట్ డైస్ శక్తివంతమైన సంస్థగా రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. సంస్థలో తరచూ ఘర్షణలు చోటు చేసుకున్నా వాటిని తన నైపుణ్యంతో చాకచక్యంగా చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా జూలై 20న కంపెనీకి సంబంధించి కీలక సమావేశం జరిగింది. హెర్బర్ట్ డైస్ తో పాటు కుటుంబ ప్రతినిధులు, జర్మన్ స్టేట్ ఆఫ్ లోయర్ సాక్సోనీ ఉన్నతాధికారులతో పాటు లేబర్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వోక్స్ వ్యాగన్ పర్యవేక్షక బోర్డు ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ముగిసిందని పేర్కొంది. సిఇఓ ను తొలగిస్తున్నట్లు వెంటనే ప్రకటించడం వ్యాపార, వాహన రంగాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది.
ఇదిలా ఉండగా వోక్స్ వ్యాగన్లో కార్మిక యూనియన్ల ప్రతినిధులు బోర్డులలో సగం సీట్లను కలిగి ఉన్నారు. వోక్స్ వ్యాగన్ కోసం వ్యూహాత్మక దిశను నిర్దేశించడంలో డైస్ రాణించినా చివరకు సంస్థ నుంచి తప్పు కోవాల్సి వచ్చింది.
Also Read : గూగుల్ కో ఫౌండర్ భార్యతో సంబంధం అబద్దం