Volunteers Awards: వలంటీర్లకు గుడ్‌ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం !

వలంటీర్లకు గుడ్‌ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం !

Volunteers Awards: సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వలంటీర్లకు ప్రతీఏటా ఇచ్చే నగదు పురస్కారాలను నగదు పురస్కారాలను భారీగా పెంచింది. అంతేకాదు పెంచిన నగదు పురస్కారాన్ని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(AP CM YS Jagan) లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనితో ప్రభుత్వం నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.55 లక్షల మంది వాలంటీర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమ గౌరవ వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేసినప్పటికీ… వివిధ కారణాలతో ప్రభుత్వం వారి వేతనాలను పెంచలేదు. అయితే తాజాగా వారి సేవలకు ఇచ్చే నగదు పురస్కారాలను భారీగా పెంచింది.

Volunteers Awards Viral

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ(YCP) అధికారంలోనికి వచ్చిన తరువాత నవరత్నాల అమలకు రాష్ట్ర వ్యాప్తంగా 2.55 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. ప్రతీ 50 ఇళ్లను ఒక క్లష్టర్ గా విభజించి… క్లష్టర్ కు ఒక వాలంటీరు చొప్పున నియమిస్తూ… వారికి ఐదువేల రూపాయల గౌరవ వేతనం ప్రకటించింది. ఆ తరువాత న్యూస్ పేపర్ కోసం మరో రెండు వందల రూపాయలను అదనంగా అందిస్తోంది. అయితే వారి సేవలను మెచ్చిన ప్రభుత్వం…ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురికి సేవావజ్ర అవార్డులను అందిస్తుంది. ఈ సేవావజ్ర అవార్డు కింద గత మూడేళ్లుగా రూ. 30 వేల చొప్పున ప్రభుత్వం నగదు బహుమతి అందజేయగా… ఇప్పుడు ఆ మొత్తాన్ని 50 శాతం పెంచి ఏకంగా రూ. 45 వేలు చేసింది.

అలాగే మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ప్రతి ఐదుగురు వలంటీర్లకు సేవారత్న అవార్డులను అందిస్తుంది. వీటి కింద గత మూడేళ్లు రూ. 20 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.30 వేలకు పెంచింది. అదేవిధంగా కనీసం ఏడాదికాలంగా పనిచేస్తూ.. ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన వలంటీర్లందరికీ సేవామిత్ర అవార్డులు అందిస్తుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన నగదు బహుమతులను తాజా పురస్కారాల ప్రదానోత్సవంలో వలంటీర్లకు అందించనుంది.

Also Read: AP High Court : ఏపీలో అక్రమ మైనింగ్..అధికారుల పై నిప్పులు చెరిగిన ధర్మాసనం

Leave A Reply

Your Email Id will not be published!